Anirudh: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పై అలాంటి విమర్శలు.. తప్పు చేశారంటూ?

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ముందువరసలో ఉన్నారు. అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం కొత్తగా ఉండటంతో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తమిళంలో చాలా సినిమాల సక్సెస్ లో అనిరుధ్ కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం. అనిరుధ్ కు సోషల్ మీడియాలొ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. అనిరుధ్ కు క్రేజ్ సైతం అంచనాలను మించి పెరుగుతోంది. అయితే అనిరుధ్ కూడా కాపీ క్యాట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తన సాంగ్స్ ను తనే కాపీ కొడుతున్నాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జవాన్ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ అజ్ఞాతవాసి సినిమాలోని గాలివాలుగా, బైటికొచ్చి చూస్తే సాంగ్స్ ను మిక్స్ చేసినట్టుగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జవాన్ సినిమా సాంగ్స్ విషయంలో అనిరుధ్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తర్వాత సాంగ్స్ తో అయినా అనిరుధ్ ఈ నెగిటివ్ కామెంట్లకు చెక్ పెడతారేమో చూడాల్సి ఉంది.

అనిరుధ్ (Anirudh) తన పాటలను తనే కాపీ కొడితే వచ్చిన పాపులారిటీ పోవడానికి ఎంతోకాలం పట్టదని ఈ విషయాలను ఆయన గుర్తుంచుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ ఈ విమర్శల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. భాషతో సంబంధం లేకుండా అనిరుధ్ పాపులారిటీని పెంచుకున్నారు. అనిరుధ్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉండగా అనిరుధ్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించేలా జైలర్ మూవీ ఉందనే సంగతి తెలిసిందే. అనిరుధ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అనిరుధ్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus