Puspa: ‘విలన్’ కథతో ‘పుష్ప’కి లింకేంటి..?

ఏదైనా పెద్ద సినిమా మొదలైందంటే.. దానికి సంబంధించి మీడియాలో రకరకాల వార్తలొస్తుంటాయి. సినిమా స్టోరీ ఏంటి..? హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? ఇలా ఎన్నో కథనాలు వస్తుంటాయి. అయితే ఒక్కోసారి కాపీ ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాకి సంబంధించి కూడా ఇలాంటి ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కథ.. మణిరత్నం సినిమాకి కాపీ అంటూ మీడియా సర్కిల్స్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. విక్రమ్, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ లు నటించిన ‘విలన్’. ‘రావణ్’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘విలన్’ అనే పేరుతో విడుదల చేశారు. రామాయణాన్ని.. రావణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే కథ ఇది. హీరోయిన్ ను విక్రమ్ కిడ్నాప్ చేసి అడవిలో దాస్తాడు. దానికి కారణం తన చెల్లి మరణమని రివీల్ చేశారు. ‘పుష్ప’ సినిమాలో కూడా ఇలాంటి పాయింట్ ఒకటి ఉందని చెబుతున్నారు.

దర్శకుడు సుకుమార్ అదే కథను మార్చి.. అడవికి ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ పెట్టి సరికొత్త ట్రీట్మెంట్ తో స్క్రిప్ట్ రాసుకున్నాడని టాక్. ‘విలన్’ సినిమాలో మాదిరి ‘పుష్ప’లో కూడా సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందని సమాచారం. అల్లు అర్జున్ చెల్లెలిగా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసుకున్నారని టాక్. అల్లు అర్జున్ ని ఎదుర్కొనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ ‘విలన్’ కథకు లింక్ చేస్తూ కాపీ కథ అని చెబుతున్నారు. మరి ఈ స్టోరీలో ఎంతవరకు నిజముందో కొద్దిరోజులు ఆగాల్సిందే!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus