Chikiri Chikiri: ‘దీని ఒరిజినల్ ప్లే చేయండిరా’… ఈ మాటలు ఫ్యాషన్‌ అయిపోయాయా?

రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా – జాన్వీ కపూర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా ఐదు నెలలు ఉన్నా.. టీమ్‌ అప్పుడే ప్రచారం స్టార్ట్‌ చేసేసింది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవేంటి అనేది తర్వాత చూస్తే.. ఇటీవల వచ్చిన ఓ మ్యూజిక్‌ బిట్‌ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఓ 12 సెకన్ల క్లిప్‌ పట్టుకుని ఏకంగా పాట మీద, సినిమా మీద కాపీ మరక వేసేస్తున్నారు కొంతమంది ఔత్సాహిక నెటిజన్లు. ‘దీని ఒరిజినల్‌ ప్లే చేయండిరా’ అంటూ మీమ్స్‌ రెడీ చేస్తున్నారు.

Chikiri Chikiri

పట్టుమని 15 సెకన్లు కూడా లేని ఓ మ్యూజిక్‌ బిట్‌ పట్టుకుని పాటకు ఇచ్చిన ట్యూన్‌ జడ్జ్‌ చేసేంత స్థాయికి మన టాలీవుడ్‌ నెటిజన్లు ఎదిగిపోయారు అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. ఒకవేళ లేదంటే ఇదంతా ఓ హీరో సినిమా మీద మరో హీరో అభిమానులు (పేరు చెప్పుకుంటూ) చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పాలి. ‘ఆ సినిమా తక్కువ చేద్దాం. అప్పుడు మన పోస్టులకు మంచి రెస్పాన్స్‌’ వస్తుంది అనే దుగ్ధతో చేస్తున్న పని అని చెప్పొచ్చు. నిజానికి ‘చికిరి’ పాటకు టీజర్‌లో వచ్చిన సంగీతం కొత్తగానే ఉన్నాయి.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఏఆర్‌ రెహ్మాన్‌ మీద కాపీ మరకలు ఇప్పటివరకు అరుదు. అప్పుడప్పుడు వచ్చినా అవి ఇన్స్పిరేషన్‌లా ఉంటాయే తప్ప ఆయన మీద ఎప్పుడు ఈ స్థాయిలో ట్రోలింగ్‌ రాలేదు. ఇదంతా హీరో ఫ్యాన్స్‌ వర్సెస్‌ హీరో ఫ్యాన్స్‌ అనే సిట్యువేషన్‌ వల్లనే అని చెప్పాలి. ఈ రోజు ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నారు. అప్పుడు కూడా కాపీలా ఉంటే అప్పుడు ఎలాంటి ట్రోలింగ్‌ అయినా చేసుకోవచ్చు. ఇంకా వంట బయటకు రాకుండానే రుచి బాలేదు అని చెప్పినట్లు ‘దీని ఒరిజినల్ ప్లే చేయండిరా’ అంటూ చెప్పడం ఫ్యాషన్‌ అయిపోయింది ఈ మధ్య.

తమన్నా ట్రాన్స్‌పరెంట్‌ గౌన్‌.. అందాలు అదరహో.. ధర కూడా అదరహో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus