సంక్రాంతి సినిమాలపై కరోనా ఎఫెక్ట్.. అలా జరుగుతుందా?

గతేడాది ఇదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ వల్ల పలు భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా పడ్డాయి. 2022 సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య భారీ పోటీ ఉంటుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. 2023 సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద థియేటర్ల విషయంలో పోటీ మామూలుగా లేదనే సంగతి తెలిసిందే. అయితే 2023 సంక్రాంతి సినిమాలపై కూడా కరోనా ఎఫెక్ట్ ఉంటుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసులు మాత్రం ఎక్కువ సంఖ్యలో నమోదు కావడం లేదు. బీఎఫ్7 వేరియంట్ మరీ ప్రమాదకరం కాదని అయితే ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతానికి అయితే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలపై కరోనా ఎఫెక్ట్ ఉండే అవకాశం లేదు.

ఈ రెండు సినిమాలు కరోనా గండాన్ని అధిగమించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాల బడ్జెట్ 250 కోట్ల రూపాయలు కాగా ఈ రెండు సినిమాలకు 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం. ఈ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు కూడా భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ అవుతుండగా

ఈ సినిమాల ట్రైలర్లు జనవరి ఫస్ట్ వీక్ లోనే రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని చిరంజీవి, బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో చూడాల్సి ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus