Anushka Shetty: ఈ ఏడాదైనా అనుష్క పెళ్లి చేసుకుంటారా..?

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనుష్కను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. నిశ్శబ్దం సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న అనుష్క రారా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా విజృంభణ వల్ల సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి అనుష్క ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ఈ సినిమాకు అనుష్క డేట్లు కేటాయించడం లేదని సమాచారం. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు సినిమాల షూటింగ్ లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అనుష్కతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న అనుష్కకు పెళ్లి తరువాత కూడా ఆఫర్లు తగ్గే అవకాశం లేదు. అనుష్క పెళ్లికి సంబంధించి గతంలో కొన్ని వార్తలు వైరల్ అయినా ఆ వార్తలు నిజం కాలేదు. ఈ ఏడాదైనా అనుష్క పెళ్లి చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus