Mahesh Babu: సూపర్ స్టార్ ను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్..?

దేశంలో గత కొన్నిరోజుల నుంచి శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలను కూడా టెన్షన్ పెడుతోంది. భారత్ లో రికార్డు స్థాయిలో దాదాపు రెండు లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేగంగా పెరుగుతున్న కేసుల ప్రభావం సినిమా రంగంపై ఎక్కువగా పడుతోంది. పెరుగుతున్న కరోనా కేసుల వల్ల కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకుంటుంటే మరికొన్ని సినిమాల షూటింగ్ లు పోస్ట్ పోన్ అవుతున్నాయి.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కరోనా విజృంభణ వల్ల గోవా షెడ్యూల్ వాయిదా పడటంతో హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ బాబు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు షూటింగ్ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకునేలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. షూటింగ్ మెంబర్స్ లో ఒక్కరికి కరోనా సోకినా షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది.

కరోనా నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఆటంకాలు కలగకుండా షూటింగ్ ను పూర్తి చేయాలని మహేష్ బాబు భావిస్తున్నారని తెలుస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్, నిర్మాతలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.

కరోనా విజృంభణ వల్ల సర్కారు వారి పాట షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. 2022 సంవత్సరం సంక్రాంతి పండుగకు ఈ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేయాలని మహేష్ బాబు భావిస్తున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus