దగ్గుబాటి బ్రదర్స్ పై ఆరోపణలు.. కోర్టు విచారణకు ఎగ్గొట్టిన రానా..!

దగ్గుబాటి బ్రదర్స్ అయిన సురేష్ బాబు, వెంకటేష్ లు.. తనకు అమ్మిన భూమిని ఆయన కొడుకు రానా పేరున రిజిస్ట్రేషన్‌ చేశారంటూ సదరన్‌ స్పైసిస్‌ గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ నందకుమార్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం నాడు పురానీ హవేలీలోని సిటీసివిల్‌ కోర్టు నందు ఆయన మీడియాతో మాట్లాడి వెంకటేష్, సురేష్ బాబు ల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫిలింనగర్‌ సమీపంలో తనకు అగ్రిమెంట్‌ చేసిన భూమిని తనతో పాటు మరొకరికి కూడా అగ్రిమెంట్‌ చేసి మోసం చేశారని నందకుమార్‌ చెప్పుకొచ్చారు.

కోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి.. సురేష్ బాబు తన పెద్ద కొడుకు రానా పేరున రిజిస్ట్రేషన్‌ చేసారని, వెంకటేష్ కూడా 1200 గజాల భూమిని తనకు లీజ్‌ అగ్రిమెంట్‌ చేసినట్టు చెప్పి నందకుమార్ వాపోయారు. తనకు అగ్రిమెంట్ చేసిన భూమి దగ్గరనుండి ఖాళీ చేయించేందుకు దగ్గుబాటి పన్నిన కుట్ర ఇదని ఆయన చెబుతున్నారు. జూలై 12న ఈ స్థలానికి సంబంధించిన వ్యవహారం విషయంలో రానా కోర్టు మెట్లెక్కిన సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.

కాగా.. రానా హాజరు కాకపోవడంతో విచారణను ఆగస్టు 2కు కోర్టు వాయిదా వేసింది.ఒకప్పటి నటి మాధవి లత కి ఫిలింనగర్ లో ఉన్న 2,200 చదరపు గజాల స్థలాన్ని, దగ్గుబాటి సోదరులు అయిన సురేష్‌ బాబు, వెంకటేష్ లు కొనుగోలు చేశారు. 2014లో ఆ స్థలాన్ని బిజినెస్ మెన్ అయిన నందకుమార్ కు లీజుకు ఇవ్వడం జరిగింది. 2014వ సంవత్సరంలో జరిగిన అగ్రిమెంట్ తర్వాత 2016 లో, 2018 లో కూడా లీజు అగ్రిమెంట్ రెన్యువల్ చేయించుకున్నాడు నందకుమార్.

లీజు అగ్రిమెంట్ కొనసాగుతూ ఉండగానే.. ఆ 2200 చదరపు గజాల స్థలంలో 1000 గజాల స్థలాన్ని సురేష్ బాబు రానా పేరు పై రిజిస్ట్రేషన్ చేయించారట. రానా రిజిస్ట్రేషన్ పూర్తయిన నందకుమార్ ను ఆ స్థలం ఖాళీ చేయాలని ఒత్తిడి చేసారని… ఆ ఒత్తిడి తట్టుకోలేక అతను ఆ స్థలాన్ని ఖాళీ చేసినట్లు గత విచారణలో నందకుమార్ చెప్పాడు. అయితే తాజా విచారణకి రానా హాజరు కాకపోవడం గమనార్హం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus