ప్రముఖ నటి సమంతకు కూకట్‌పల్లి కోర్టులో ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవరూ ప్రసారం చేయకూడదని.. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఆమెకి సంబంధించిన వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశింది. ఆమె కూడా తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని సమంత సూచించింది. అంతేకాకుండా.. సమంతపై ఇన్ డైరెక్ట్ గా కొన్ని కామెంట్స్ చేసింది కోర్టు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి ఛాన్స్ మీరే ఇస్తున్నారంటూ పరోక్షంగా జడ్జి కామెంట్ చేశారు.
అలానే విడాకుల విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడాన్ని కూడా పాయింట్ అవుట్ చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేశారంటూ డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తూ తనను కించపరిచారని సమంత పిటిషన్ దాఖలు చేసింది.
వాదనల అనంతరం కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఆ రెండు యూట్యూబ్ ఛానళ్లు, సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియో లింక్స్‌ని తొలగించాలని ఆదేశాలు వెలువరించింది.