Suresh Babu: రూ.లక్ష మోసపోయిన స్టార్ ప్రొడ్యూసర్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తరువాత కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే వ్యాక్సిన్ల పేరుతో పలువురు మోసాలకు పాల్పడుతుండగా సినీ ప్రముఖులు మోసపోతూ ఉండటం గమనార్హం. కరోనా వ్యాక్సిన్లు తన దగ్గర ఉన్నాయంటూ ఒక వ్యక్తి స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుకు టోకరా ఇచ్చారు. కొన్నిరోజుల క్రితం నాగార్జున రెడ్డి అనే వ్యక్తి 500 డోసుల కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్ బాబు ఆఫీస్ కు ఫోన్ చేశాడు.

నాగార్జున రెడ్డి సురేష్ బాబును వ్యాక్సిన్ల కోసం తన భార్య ఖాతాలో లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని కోరగా సురేష్ బాబు మేనేజర్ ఆ డబ్బును డిపాజిట్ చేశారు. ఆ తరువాత నిందితుడు నాగార్జున రెడ్డి ఫోన్ స్విఛాఫ్ చేయడంతో మోసపోయామని గ్రహించిన సురేష్ బాబు తన మేనేజర్ తో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు రోజుల క్రితమే నాగార్జున రెడ్డిని ఒక ఛానల్ ప్రతినిధిని మోసం చేసిన కేసులో అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం నాగార్జున రెడ్డి సంగారెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారని సమాచారం. నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సురేష్ బాబు కేటుగాని చేతిలో మోసపోయారని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మహా మాయగాళ్లు మాయమాటలు చెప్పి ఈ తరహా మోసాలకు పాల్పడుతుండగా కొన్ని మోసాలు వెలుగులోకి వస్తుంటే ఎక్కువ సంఖ్యలో మోసాలు వెలుగులోకి రావడం లేదు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus