ప్రభాస్ కోసం సాఫ్ట్ అండ్ ట్రెండీ టైటిల్

సినిమా సినిమాకు మధ్య రెండేళ్ల గ్యాప్ ప్రభాస్ కి కామనైపోయింది. ఆయన బాహుబలి చిత్రం నుండి ఇదే పద్ధతి ఫాలో అవుతూ వస్తున్నాడు. బాహుబలి తరువాత చకచకా సినిమాలు చేస్తాను అని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు. కానీ అది ఒట్టి మాటగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ప్రభాస్ సాహో సినిమా కోసం రెండేళ్ల వ్యవధి తీసుకున్నారు. సాహో విడుదల తరువాత ఆయన మళ్ళీ మరో ఆరు నెలల విశ్రాంతి తీసుకోవడం గమనార్హం. ఆయన రెడీ అయ్యి షూటింగ్ పూర్తి చేద్దాం అనుకునే నాటికి, కరోనా లాక్ డౌన్ దెబ్బేసింది.

ఈ నేపథ్యంలో రాధా కృష్ణ దర్వకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూడా 2020లో రావడం కష్టమే అంటున్నారు. అంటే సాహో విడుదలైన మరో రెండేళ్లకు ఆయన లేటెస్ట్ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనంలో ఉన్నారు. సినిమా విడుదల వెనక్కి వెళ్లడం ఒక కారణమైతే..అసలు మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా లేకపోవడం మరొక కారణం. ఆ మధ్య ప్రభాస్ ఫ్యాన్స్ ఏకమై సోషల్ మీడియాలో నిర్మాతలు యూవీ క్రియేషన్స్ పై నెగెటివ్ కామెంట్ తో యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

దీనితో మేకర్స్ దిగివచ్చి జస్ట్ షూటింగ్ షెడ్యూల్ అప్డేట్ ఇచ్చి వారి ఆవేశానికి అడ్డుకట్ట వేశారు. ఐతే సినిమా విడుదల కూడా లేటవుతున్న తరుణంలో ఫ్యాన్స్ కోసం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనికోసం ఓ సాఫ్ట్ అండ్ ట్రెండీ టైటిల్ వెతికే పనిలో దర్శకుడు ఉన్నాడని సమాచారం. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus