సందీప్ కిషన్ – దేవా కట్టా కాంబో.. అప్పుడు విలన్ గా ఇప్పుడు హీరోగా..!

సందీప్ కిషన్ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు. హిట్టు దక్కక ఇబ్బంది పడుతున్న హీరోల్లో కూడా ఒకరు. ఇటీవల ఇతని నుండి వచ్చిన ‘మైఖేల్’ చిత్రం నిరాశపరిచింది. ఓపెనింగ్స్ బాగానే వచ్చినా టాక్ బ్యాడ్ గా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిలబడలేకపోయింది. ‘మైఖేల్’ కు ముందు సందీప్ నుండి వచ్చిన ‘గల్లీ రౌడీ’ ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రాలు యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

హిట్లు లేకపోయినా సందీప్ కిషన్ కు చేతి నిండా ఆఫర్లు ఉన్నాయి. అసలే ప్లాపుల్లో ఉన్న ఇతను ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతుండడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. సందీప్ కిషన్ ‘ప్రస్థానం’ చిత్రంతో తన నటప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఆ సినిమాకు దర్శకుడు దేవా కట్టా. ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రను సందీప్ కిషన్ చేశాడు. సందీప్ ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మన్స్ లలో అది కూడా ఒకటి. ఆ సినిమా వచ్చి దాదాపు 13 ఏళ్ళు కావస్తోంది.

ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ కానుంది. అవును సందీప్ కిషన్ – దేవ కట్టా కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఇందులో సందీప్ హీరోగా కనిపించబోతున్నాడు. కథా చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది అని వినికిడి. దేవా కట్టా మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు అయినప్పటికీ హిట్లు కొట్టలేకపోతున్నాడు. ఇతని గత చిత్రం ‘రిపబ్లిక్’ కూడా ప్లాప్ అయ్యింది. మరి సందీప్ కిషన్ – దేవా కట్టా ల కలయిక బ్లాక్ బస్టర్ కొడుతుందో లేదో చూడాలి..!

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus