Devara: దేవర మూవీ సీక్వెల్ విషయంలో ఆ సందేహాలు అవసరం లేదా?

దేవర1 (Devara) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మూడు రోజుల్లోనే ఈ సినిమాకు 304 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రిలీజ్ రోజున రికార్డ్ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శించడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు. అయితే దేవర మూవీ సీక్వెల్ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవర సీక్వెల్ మాత్రం కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. దేవర సీక్వెల్ కు అవసరమైన కథ, కథనం ఉన్నాయని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా మ్యాజిక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Devara

దేవర సీక్వెల్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అందువల్ల దేవర1 తో పోల్చి చూస్తే దేవర సీక్వెల్ కు వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండవని తెలుస్తోంది. కొరటాల శివకు (Koratala Siva) దేవర సక్సెస్ బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. దేవర మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్లు సైతం పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి.

దేవర అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్ కావడం కష్టం కాదని తెలుస్తోంది. ఈరోజు నుంచి కలెక్షన్లు తగ్గే ఛాన్స్ ఉన్నా రాబోయే రోజుల్లో సెలవులు ఉండటంతో దేవరకు సమస్య లేదని తెలుస్తోంది. దేవర సక్సెస్ తో ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. దేవర సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR)  అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.

దేవర ఫుల్ రన్ కలెక్షన్లతో నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవర సినిమాకు ఇతర రాష్ట్రాల్లో సైతం భారీ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. దేవర రిజల్ట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది.

స్టార్ డైరెక్టర్ జక్కన్న అశ్వినీదత్ కు మరో ఛాన్స్ ఇవ్వడం సాధ్యమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus