నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ‘అఖండ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఈ నెలాఖరున విడుదల కావాల్సివుంది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇరవై రోజుల్లో ఈ టీజర్ కి 50 మిలియన్ వ్యూస్ రాగా.. ముప్పై రోజుల్లో మరో నాలుగు మిలియన్ల వ్యూస్ సాధించి 54 మిలియన్ వద్ద ఆగింది. బాలయ్య సినిమా టీజర్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం చాలా అరుదు.
అయితే టీజర్ కి ఇన్ని కోట్ల వ్యూస్ రావడానికి కారణం జిమ్మిక్కులే అని టాక్. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఓ డిజిటల్ కంపెనీను ఇన్వాల్వ్ చేశారని.. సదరు కంపెనీ కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీలతో టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చేలా చేసిందని సమాచారం. ఇదంతా కూడా సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ రావడం కోసమే చేశారని తెలుస్తోంది. వీరు ప్లాన్ చేసినట్లుగానే సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం ‘స్టార్ మా’ మొత్తం రూ.15 కోట్లు చెల్లించింది.
బాలయ్య కెరీర్ లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. వారు అనుకున్న పని పూర్తి కావడంతో సదరు డిజిటల్ కంపెనీ టీజర్ వ్యూస్ ను కొనడం మానేసింది. అందుకే కొత్తగా టీజర్ కి ఎలాంటి వ్యూస్ రావడం లేదు. ఆర్గానిక్ ట్రాఫిక్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు సినిమా థియేట్రికల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్లకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో కొందరు డిస్ట్రిబ్యూటర్లు సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.