Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Focus » Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

  • October 31, 2026 / 04:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘కల్ట్'(Cult) సినిమా నిన్న విడుదలైంది. ‘ఆదర్శ కుటుంబం’ వంటి పెద్ద సినిమాకు పోటీగా విడుదల కావడం వల్ల ఎక్కువ శాతం ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోలేదు. కానీ విశ్వక్ సేన్‌కు ఉండే ఆడియన్స్ ఆయనకు ఉన్నారు. వాళ్ల సందడి థియేటర్లలో కనిపించింది. పూర్తిగా యాక్షన్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని తీసిన రా అండ్ వయొలెంట్ సినిమా ఇది. ఈ చిత్రానికి విశ్వక్ సేన్  దర్శకత్వం వహించడం కూడా జరిగింది.

Cult

‘తారక్ సినిమాస్’ బ్యానర్‌పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడుతుందా? రెండో రోజు నుండి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకునే అవకాశం ఉందా? అంటూ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే:

మైనస్ పాయింట్స్

‘కల్ట్’ సినిమాపై మొదటి నుండి హైప్ లేదు. ఎందుకంటే ప్రమోషనల్ కంటెంట్‌లో విపరీతమైన వయొలెన్స్ ఉంది. వయొలెన్స్ అనేది పెద్ద అడ్డుకట్ట కాకపోయినా, ఇందులో చాలా డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి. మెజారిటీ ఆడియన్స్ దానిని ఇబ్బందిగా ఫీల్ అయ్యారు.

విశ్వక్ సేన్ కూడా ఈ మధ్య ఫామ్‌లో లేడు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’, ‘ఫంకీ’ వంటి సినిమాలన్నీ దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో ‘కల్ట్’పై మొదటి నుండి బజ్ లేదు. అందుకే ట్రేడ్ సర్కిల్స్‌లో కూడా రిలీజ్‌కు ముందు ఈ సినిమా పెద్దగా సౌండ్ చేయలేదు.

కంటెంట్ విషయంలో చూసుకున్నా కూడా కల్ట్ అంతంత మాత్రమే. సినిమా ఓపెనింగ్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. దాదాపు ఒక 20, 30 నిమిషాల వరకు పబ్‌కు వెళ్లిన ఫీలింగ్ ఇస్తుంది. అంతేతప్ప తెరపై ఆసక్తికర సన్నివేశాలు ఏమీ కనిపించవు.

హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ కూడా చాలా ఆలస్యంగా ఉంటుంది. దాదాపు ఇంటర్వెల్‌కు ముందు విశ్వక్ ఎంట్రీ ఇస్తాడు. అప్పటివరకు దారుణమైన విజువల్స్ వస్తాయి. అలా బ్యాక్ టు బ్యాక్ వచ్చే హింసాత్మక సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి.

విశ్వక్ ఎంట్రీ తర్వాత కూడా కథనం ముందుకు సాగదు. అతనొక ఫైట్ చేస్తాడు, తర్వాత మళ్లీ గేమ్, ఆ తర్వాత మళ్లీ ఫైట్.. ఇలాగే కథనం సాగుతుంది.

సినిమా మొత్తం గోవాలో, ఒక పబ్ సెట్‌లో తీసేశారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్, తరుణ్ భాస్కర్ డైలాగుల కోసం తప్ప లొకేషన్స్ కోసం ఖర్చు పెట్టింది ఏమీ లేదు. సినిమాలో విశ్వక్ సేన్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తప్ప తెలిసిన ముఖాలు ఎక్కువగా ఏమీ లేవు.

రూ.25 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఏమీ కనిపించలేదు.

పాజిటివ్ పాయింట్స్

క్లైమాక్స్‌లో విలన్ ట్రాక్‌ను రివీల్ చేసిన విధానం, అతని బ్యాక్ స్టోరీ బాగున్నాయి. ఆ నటుడు జనాలకు పెద్దగా తెలియకపోయినా.. దానిని ఒక ట్విస్ట్ మాదిరి కాకుండా, ఎమోషనల్ కోటింగ్ ఇచ్చి ఒపీనియన్ షిఫ్ట్ అయ్యేలా చేశాడు దర్శకుడు.

తరుణ్ భాస్కర్ డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్, శ్రీకాంత్ అయ్యంగార్, మురళీశర్మల మధ్య జరిగే సంభాషణలు ఎంజాయ్ చేయొచ్చు.

రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో రవి బస్రూర్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది.

మొత్తంగా ‘కల్ట్’లో అలరించే అంశాలు తక్కువ. యాక్షన్ సినిమాలు, ముఖ్యంగా సైకలాజికల్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా పర్వాలేదు అనిపించొచ్చు. అయినప్పటికీ ఈ కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వడం కష్టమే.

హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cult
  • #cult movie
  • #Vishwak Sen

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

6 mins ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

50 mins ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

4 hours ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

3 hours ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

4 hours ago
‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

5 hours ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

1 day ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version