Curry and Cyanide: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ చూశారా? ఒళ్లు జలదరించడం ఖాయం!

డాక్యమెంటరీలు అంటే బోరింగ్‌ అనుకుంటుంటారు కొందరు. అలాంటి వారిలో మీరు కూడా ఉన్నారా? అయితే సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ లాంటి ఓ డాక్యుమెంటరీ చూస్తారా? అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఓపెన్‌ చేసి ‘కర్రీ అండ్‌ సైనైడ్‌’ వెంటనే చూసేయండి. అయిఏ ముందుగానే చెబుతున్నాం ఈ డాక్‌ సిరీస్‌ చూస్తున్నప్పుడు మీ ఒళ్లు జలదరించడం ఖాయం. ఈ మాట మేం అనడం లేదు. ఈ సిరీస్‌ను చూసిన నెటిజన్లు చెబుతున్నారు. కమర్షియల్‌ హంగులు లేకుండా వాస్తవ పరిస్థితులు, నిజ జీవిత సంఘటనలను చెబుతుంటాయి డాక్యుమెంటరీలు.

సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడటానికి ఇష్టపడే యువత ఈ విషయంలో కాస్త తక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి సమయంలో ఓ డాక్యుమెంటరీ ఏకంగా 30కు పైగా దేశాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అదే ‘కర్రీ అండ్‌ సైనైడ్‌’. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబరు 22న అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్‌ భారీగా ఓటీటీయన్స్‌ ఆదరణ పొందుతోంది. ఈ డాక్యుమెంటరీ పూర్తి పేరు ‘కర్రీ అండ్‌ సైనైడ్‌: ది జాలీ జోసెఫ్‌ కేస్‌’.

క్రిస్టో టామీ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ -10 స్ట్రీమింగ్‌ కంటెంట్‌లలో ఒకటిగా ఉంది. ఈ డాక్యుమెంటరీ కథేంటంటే… కేరళలోని కూడతైకి చెందిన జాలీ అలియాస్‌ జాలీ జోసెఫ్‌ విలాసవంతమైన జీవితం గడపాలని ఆశపడుతుంటుంది. ఆమె ఆలోచనకు అడ్డుగా ఉన్న అత్తను.. ఆ తర్వాత ఆస్తి కోసం మామను, తనను అనుమానించాడని భర్తను, బాబాయిని చంపేస్తుంది. వాళ్లందరికీ ఆహారంలో సైనైడ్‌ పెట్టి మరీ చంపేస్తుంది.

ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని స్నేహితురాలు, ఆమె కూతురుకి కూడా సైనైడ్ ఇచ్చి దారుణంగా హతమారుస్తుంది. అలా క్రూరంగా ఆరుగురిని హత్య చేసినా పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. అయితే ఇదంతా జరిగిన ఆరేళ్ల తర్వాత జాలీ ఆడపడుచు ఈ విషయం పోలీసులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వస్తుంది. ఈ మొత్తం ఘటనల సమహారాన్ని ‘కర్రీ అండ్‌ సైనైడ్‌’గా (Curry and Cyanide) తీర్చిదిద్దారు. గంటన్నర నిడివి ఉన్న ఈ సిరీస్‌ తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus