Venkat Prabhu: ‘కస్టడీ’ తర్వాత వెంకట్‌ప్రభు సినిమా మరో స్టార్‌తో.. భలే ఛాన్స్‌ వచ్చిందే!

కొంతమంది దర్శకులకు ఫ్లాప్‌ వచ్చినా, డిజాస్టర్‌ వచ్చినా తర్వాతి సినిమా ఆటోమేటిగ్గా సెట్‌ అయిపోతుంది. గత సినిమా ఫలితం అస్సలు లెక్కలోకే రాదు. అలాంటి దర్శకుల్లో వెంకట్‌ ప్రభు ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు దేనికవే వైవిధ్యంగా ఉంటాయి. అందుకేనేమో కొన్ని సినిమాలకు మంచి ఫలితాలు రాకపోయినా తర్వాతి సినిమా ఓకే అయిపోతుంటుంది. ఇప్పుడు ‘కస్టడీ’ లాంటి ఇబ్బందికర ఫలితం తర్వాత కూడా ఆయన స్టార్‌ హీరో సినిమా పట్టేశారు అని అంటున్నారు.

వెంకట్‌ ప్రభు సినిమా అంటే మినిమమ్‌ స్టఫ్‌ ఉంటుంది. సగటు సినిమాకి ఆయన సినిమాలకు చాలా తేడా ఉంటుంది. అయితే ఇటీవల వచ్చిన ‘కస్టడీ’ సినిమాలో ఆ మ్యాజిక్‌ మిస్‌ అయ్యింది అంటున్నారు. అందుకే సినిమాకు సరైన ఫలితం రాలేదు అని చెబుతున్నారు. దీంతో తర్వాతి సినిమా ఎలా ఉంటుంది, ఎవరు చేస్తారు అనే చర్చ మొదలైంది. ‘కస్టడీ’ ఫలితం విషయంలో ఇబ్బందికరంగా ఉండటంతో పెద్ద హీరో సినిమా ఓకే అవ్వడం కష్టమే అన్నారు. కానీ ఇప్పుడు స్టార్‌ హీరోను డైరెక్ట్‌ చేయబోతున్నారు.

‘కస్టడీ’ సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా వెంకట్‌ ప్రభుతో విజయ్ లాంటి ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ కలయికలో సినిమా దాదాపు ఓకే అయినట్లు చెబుతున్నారు. సంక్రాంతికి ‘వారసుడు’ సినిమాతో పలకరించిన విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్‌తో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. దీపావళికి ఈ సినిమా రిలీజ్‌ చేయనున్నారని సమాచారం. అయితే ఆ సినిమా తర్వాత విజయ్‌ లైనప్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు.

అయితే లేటెస్ట్‌ సమాచారం ప్రకారం విజయ్‌ తర్వాతి సినిమా (Venkat Prabhu) వెంకట్‌ ప్రభుతోనే అంటున్నారు. స్టార్‌ హీరోలతో కూడా ప్రయోగాలు చేసే వెంకట్‌ ప్రభు ఇప్పుడు విజయ్‌తో ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. విజయ్‌ మామూలు సినిమా తీస్తేనే రికార్డులు బద్దలవుతాయి. మరిప్పుడు ప్రయోగాలు చేసే వెంకట్‌ ప్రభుతో చేస్తే ఏమవుతుందో చూడాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus