బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కి ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయింది. ముంబై ఎయిర్ పోర్టులో గంట పాటు షారుఖ్ ఖాన్ ను కస్టమ్స్ అధికారులు నిలిపివేసినట్టు తెలుస్తోంది. నటుడు షారుక్ ఖాన్ షార్జాలో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ వెళ్లొస్తుండగా షారుక్ తోపాటు ఆయన టీంను టీ-3 టెర్మినల్ వద్ద నిలిపివేయడమే కాకుండా ఆయన వద్ద ఉన్న లగేజ్ ని గంటపాటు తనకి చేశారు. ఈ తనిఖీలలో భాగంగా యాపిల్ వాచ్ తో పాటు పలు లగ్జరీ వాచ్లు బయటపడ్డాయి.
ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులు షారుక్ ఖాన్ వద్ద నుంచి వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులకు షారుఖ్ ఖాన్ తన క్రెడిట్ కార్డు నుంచి 6.88 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇలా ఆరు లక్షలు చెల్లించడంతో షారుక్ ఖాన్ వాచీలను తిరిగి ఇచ్చినట్టు సమాచారం అయితే ఈ వాచీలు ధర సుమారు 18 లక్షల వరకు విలువ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ దరకు 30% కస్టమ్స్ డ్యూటీ చెల్లించిన అనంతరం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ విచారణ అనంతరం షారుక్ ఖాన్ అక్కడి నుంచి వెళ్లిపోగా తన బాడీగార్డ్ రవిశంకర్ షారుఖ్ ఖాన్ క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ ని చెల్లించి తిరిగి ఆ వాచీలు ఉన్న బ్యాగ్ ను తీసుకెళ్లారు.కస్టమ్స్ డ్యూటీ చెల్లించే ప్రక్రియ ముగిసిన తర్వాత వెళ్లేందుకు అనుమతి తెలిపారు. ఇకపోతే షారుఖ్ ఖాన్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కోసం షార్జా వెళ్లారు.
ఈ కార్యక్రమంలో భాగంగా షారుఖ్ ఖాన్ కు గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా అండ్ కల్చరల్ నేరేటివ్ అవార్డుతో సత్కరించారు.ఇక ఈ కార్యక్రమం నిమిత్తం షార్జా వెళ్లి వస్తుండగా ఆయనకు ఈ చేదు సంఘటన ఎదురయింది.ఇక షారుక్ సినిమాల విషయానికొస్తే ఈయన పఠాన్ సినిమాతో పాటు జవాన్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!