‘అఖండ'(Akhanda) ‘వీరసింహారెడ్డి'(Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari).. వంటి సూపర్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj). జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాబీ (K. S. Ravindra) దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మాత. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.దీంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) రావడం వల్ల కొంచెం డౌన్ అయినా… ‘డాకు మహారాజ్’ స్ట్రాంగ్ గానే కలెక్ట్ చేస్తుంది.
ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 11.54 cr |
సీడెడ్ | 10.07 cr |
ఉత్తరాంధ్ర | 7.97 cr |
ఈస్ట్ | 5.37 cr |
వెస్ట్ | 4.09 cr |
గుంటూరు | 6.83 cr |
కృష్ణా | 4.71 cr |
నెల్లూరు | 2.86 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 53.44 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.33 cr |
ఓవర్సీస్ | 7.17 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 63.94 cr (షేర్) |
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా రూ.63.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.19.56 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.