Daaku Maharaaj Collections: ‘డాకు మహారాజ్’… బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత కలెక్ట్ చేయాలంటే..?

‘అఖండ’ (Akhanda)  ‘వీరసింహారెడ్డి'(Veera Simha Reddy)  ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari).. వంటి సూపర్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj). జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాబీ (K. S. Ravindra)  దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi)  నిర్మాత. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.దీంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)  రావడం వల్ల పోటీలో ఈ సినిమాకి కొంచెం కలెక్షన్స్ తగ్గాయి.

Daaku Maharaaj Collections:

అందువల్ల బ్రేక్ ఈవెన్ మార్క్ కోసం కష్టపడుతుంది ఈ సినిమా. ఒకసారి (Daaku Maharaaj) 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 12.86 cr
సీడెడ్ 11.12 cr
ఉత్తరాంధ్ర 9.80 cr
ఈస్ట్ 6.55 cr
వెస్ట్ 4.96 cr
గుంటూరు 7.34 cr
కృష్ణా 5.18 cr
నెల్లూరు 3.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 60.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.65 cr
ఓవర్సీస్ 7.72 cr
టోటల్ వరల్డ్ వైడ్ 72.27 cr (షేర్)

‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 8 రోజుల్లో ఈ సినిమా రూ.72.27 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.11.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వారం, అదీ వీక్ డేస్లో కష్టపడితే తప్ప.. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం కొంచెం కష్టంగానే కనిపిస్తుంది.

‘గేమ్ ఛేంజర్’.. ఎట్టకేలకు రూ.100 కోట్ల షేర్ మార్క్ అందుకుంది..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus