Daaku Maharaaj Twitter Review: వైల్డ్ యానిమల్ గా బాలయ్య మెప్పించాడా?

ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండో సినిమా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). జనవరి 12న విడుదల కాబోతుంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ఈ సినిమాకి బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా వంటి హీరోయిన్లు నటించారు. ఇదిలా ఉండగా.. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్, తమన్ సంగీతంలో రూపొందిన పాటలు వంటివి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు.

Daaku Maharaaj Twitter Review

కానీ రిలీజ్ ట్రైలర్.. సినిమాపై బజ్ పెంచింది. ఇక ‘డాకు మహారాజ్’ సినిమా షోలు కొన్ని చోట్ల పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమా కథ మైనింగ్ మాఫియా నడిపే విరాజ్ సుర్వి (బాబీ డియోల్).. నానాజీ అలియాస్ డాకు మహారాజ్ (హీరో బాలకృష్ణ)..ల చుట్టూ తిరుగుతుంది అని అంటున్నారు. ఈ క్రమంలో ఓ పాపని కాపాడటానికి హీరో.. ఒక ఇంట్లోకి వెళ్లడం.. ఆ తర్వాత చోటు చేసుకునే సంఘటనలు వంటివి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంటాయట.

ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ బాగా వర్కౌట్ అయ్యిందట. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా మాస్ ఆడియన్స్ కి ముఖ్యంగా బాలయ్య అభిమానులకు నచ్చుతుంది అంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మేకోవర్, యాక్టింగ్ కొత్తగా అనిపిస్తుంది అంటున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుందట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus