టాలీవుడ్‌లో ఈ మధ్య వరుస గుడ్ న్యూస్ లు హైలెట్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీలో ఉపాసన, వరుణ్ తేజ్ ఇంట ఇలా వరుస శుభవార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి దగ్గుబాటి ఫ్యామిలీ చేరింది. రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే, ఇది కేవలం మరో ‘స్టార్ కిడ్’ రాక కాదు, ఇది ఒక పెద్ద సినిమా సామ్రాజ్యానికి ‘మూడో తరం’ ఆరంభం.
డి. రామానాయుడు సృష్టించిన ఈ సినిమా లెగసీని, ఆయన కుమారులు సురేష్ బాబు, వెంకటేష్ రెండో తరంగా నిలబెట్టారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని అందుకునే జనరేషన్ రానాదే. ఈ బిడ్డ రాకతో, ఆ లెగసీని భవిష్యత్తుకు అందించే బాధ్యత అధికారికంగా మొదలైనట్టే. అందుకే ఈ వార్త దగ్గుబాటి కుటుంబానికి చాలా ప్రత్యేకం.
ఈ న్యూస్‌తో నిర్మాత సురేష్ బాబు ఆనందానికి అవధుల్లేవని సమాచారం. ఆయన్ను అందరూ ఓ పక్కా బిజినెస్‌మ్యాన్‌గా, స్టూడియో అధినేతగా చూస్తారు. కానీ, ఇప్పుడు ‘తాత’ కాబోతున్న ఆనందం ఆయన ఇంట్లో కొత్త సందడిని నింపింది. వెంకటేష్ కుమారుడు అర్జున్ ఇంకా చిన్నవాడే కావడంతో, ఈ తరం మొదటి వారసుడి కోసం ఫ్యామిలీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
రానా కెరీర్ కూడా మల్టీ ఫేస్‌డ్. నటుడిగా, నిర్మాతగా, బిజినెస్‌మ్యాన్‌గా బిజీగా ఉన్నా, ఇప్పుడు ‘తండ్రి‘ అనే కొత్త బాధ్యతలోకి అడుగుపెడుతున్నాడు. సినిమాటిక్‌గా, బిజినెస్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒక కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టడం అనేది చాలా కీలకం. ఈ కొత్త రాకతో రానా వ్యక్తిగత జీవితంలో ఆ ముఖ్యమైన ఫేజ్ స్టార్ట్ అయింది.