Venkatesh, Rana: ‘బ్రో డాడీ’ సినిమా తీసుకుంటున్నారా!

మలయాళంలో మోహన్‌లాల్‌ సినిమా విడుదలవుతోంది అంటే… తెలుగులో రీమేక్‌ రైట్స్‌ కోసం ఆలోచనలు మొదలవుతాయి అంటుంటారు. ఆ సినిమా ఫలితం కూడా చూడకుండానే రీమేక్ ముచ్చట్లు మొదలైపోతాయి. అలా ఇప్పుడు చర్చలు నడుస్తున్న చిత్రం ‘బ్రో డాడీ’. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమది. తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని పేరు చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ నెలాఖరులో ఓటీటీలో ఈ సినిమా రిలీజ్‌ చేస్తున్నారు.

అంతటి క్రేజ్‌ ఉన్న ఈ సినిమాను తెలుగులోకి తీసుకురావాలని చూస్తున్నారట సురేశ్‌బాబు. అవును మరో మలయాళ సినిమా రీమేక్‌ రైట్స్‌ కోసం సురేశ్‌బాబు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ‘బ్రో డాడీ’ సినిమా టీమ్‌తో ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నారట. త్వరలో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో సినిమా ఓటీటీలో స్ట్రీమ్‌ అయ్యేటప్పుడు తెలుగు లాంగ్వేజ్‌ లేకుండా చూసుకుంటున్నారట. మొన్నీమధ్యే సురేశ్ ప్రొడక్షన్‌ తీసుకున్న ‘మానాడు’ రీమేక్‌ విషయంలో ఇబ్బంది వచ్చింది. ఆ సినిమా ఓటీటీ వెర్షన్‌లో తెలుగు వెర్షన్‌ కూడా రిలీజ్‌ చేసేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు పక్కాగా ప్లాన్‌ వేసుకొని సినిమా రీమేక్‌ రైట్స్‌ సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అన్నీ కుదిరితే వీలైనంత త్వరగా సినిమాకు సంబంధించి సమాచారం వెల్లడిస్తారట. ఇక ఈ సినిమాలో మోహన్‌లాల్‌ పాత్రలో నటించేది ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటాం. వెంకటేశ్‌ డాడీ అవతారమెత్తేస్తాడు. మరి కొడుకు పాత్రలో ఎవరు అనే విషయంలోనే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొంతమందేమో రానా ఉన్నాడు కదా… చేసేస్తాడు అని అంటుంటే.. ఇంకొందరేమో మరేదైనా యంగ్‌ హీరో ఆ ప్లేస్‌లోకి రావొచ్చు అంటున్నారు.

దీనిపై సురేశ్‌బాబు అండ్‌ టీమ్‌ తీవ్రంగా ఆలోచిస్తోందని సమాచారం. దగ్గుబాటి మల్టీస్టారర్‌ కోసం చాలా రోజుల నుండి చర్చలు నడుస్తున్నాయి. ఓ ఓటీటీ వెబ్‌ సిరీస్‌ కోసం ఇటీవల వెంకీ, రానా కలిశారు. ఇప్పుడు ఈ సినిమాతో వెండితెరపై కూడా మెరిస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్‌బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus