Bobbili Raja: ‘బొబ్బిలి రాజా’ కి 34 ఏళ్ళు.. రానా ఫోకస్ చేయట్లేదా?

విక్టరీ వెంకటేష్ (Venkatesh) కెరీర్లో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘బొబ్బిలి రాజా’ (Bobbili Raja) ఒకటి. అప్పట్లో ఇది మాస్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. 1990 సెప్టెంబర్ 14 న విడుదలైన ఈ చిత్రం నేటితో 34 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. బి.గోపాల్ (B. Gopal) ఈ చిత్రానికి దర్శకుడు. ఓ రెగ్యులర్ మాస్ కథకి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ని జోడించి.. కొత్తగా తీసిన సినిమా ఇది.దివ్య భారతి  (Divya Bharti) ఈ చిత్రంలో హీరోయిన్. ఆమెకు తెలుగులో డెబ్యూ మూవీ ఇది.

Bobbili Raja

ఈ సినిమాలో ఆమె గ్లామర్.. తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది అని చెప్పాలి. ఆ తర్వాత ఈమెకు ఆఫర్లు కూడా పెరిగాయి. ఇక హీరో వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కూడా ఇందులో కొత్తగా అనిపిస్తుంది. ఫైట్స్ లో కూడా వెంకీ మేనరిజమ్స్ కొత్తగా ఉంటాయి. ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతం, క్లైమాక్స్ లో వచ్చే ట్రైన్ ఫైట్.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘బొబ్బిలి రాజా’ లో చాలా స్పెషల్స్ ఉంటాయి.

అయితే ఈ చిత్రాన్ని రానా (Rana) రీమేక్ చేస్తే బాగుంటుంది అని..దివంగత రామానాయుడు (Ramanaidu) గారు ఆశపడ్డారు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. రానా కూడా వెంకటేష్ గారి సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే కచ్చితంగా ‘బొబ్బిలి రాజా’ చేస్తాను అని చెప్పారు. అయితే రామానాయుడు గారు కాలం చేశాక రానా ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నాడు.

‘అరణ్య'(హాతి మేరె సాతి) (Aranya) వంటి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్..లో అడ్వెంచరస్ సినిమాలు చేశాడు కానీ, ‘బొబ్బిలి రాజా’ రీమేక్ గురించి అతను ఆలోచించడం లేదు. వాస్తవానికి ‘బొబ్బిలి రాజా’ రీమేక్ స్క్రిప్ట్ రెడీ చేయడం కూడా అంత ఈజీ కాదు. కానీ ఒకవేళ స్క్రిప్ట్ బాగా వస్తే.. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని ఇంకా గొప్పగా ఆ సినిమాని చిత్రీకరించే అవకాశాలు అయితే లేకపోలేదు. చూడాలి మరి.. ‘బొబ్బిలి రాజా’ వంటి గొప్ప చిత్రం స్క్రిప్ట్ ను ఏ డైరెక్టర్ డిజైన్ చేస్తాడో..!

పవన్ వల్ల లక్షా అరవై వేలు గెలిచిన జంట.. అసలేమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus