కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమకి పెద్ద దెబ్బె పడింది. గతేడాది 9 నెలలు, ఈ ఏడాది 3 నెలలు కలుపుకుని.. ఓ సంవత్సరం పాటు థియేటర్లు మూతపడ్డాయని చెప్పాలి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది అనే హెచ్చరికలు వస్తున్నప్పటికీ.. సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ కి మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో రూ.5 కోట్ల లోపు బడ్జెట్ కలిగిన సినిమాలు రిలీజ్ చేసుకుంటే సేఫ్ అవుతాయనే నమ్మకం అటు దర్శకనిర్మాతల్లో అలాగే డిస్ట్రిబ్యూటర్లలో కలిగింది.
ఏపీలో థియేటర్ల పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు.అక్కడ కర్ఫ్యూ ఉంది కాబట్టి నైట్ షోలకు అనుమతి లేదు,పైగా టికెట్ రేట్ల పెంపు విషయంలో ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో బాగానే సహకరిస్తుంది. చిన్న సినిమాలతో అయినా థియేటర్ వ్యవస్థని కాపాడుకునేలా తగిన చర్యలు చేపడుతుంది.ముందుగా సింగిల్ స్క్రీన్ లలో 5వ షో యాడ్ అయ్యేలా చర్చలు జరుపుతుంది.నిజానికి ఈ ప్రతిపాదన పాతదే.
అయితే ఇన్నాళ్టికి దీని పై సానుకూలంగా స్పందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా లాక్ డౌన్ టైములో కరెంటు బిల్లుల నుంచి మినహాయింపు, వినోదపు పన్నులో రాయితీ..వంటివి కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఓటిటి వ్యవస్థల భారి నుండీ థియేటర్లను కాపాడుకోవాలి అంటే ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పుడు సీరియస్ గా తీసుకుని చర్యలు చేపడుతుందో చూడాలి.