తన 25వ పుట్టినరోజుని ఆకాశంలో సెలబ్రేట్ చేసుకున్న దక్ష.. ఫోటోలు వైరల్!

దక్ష నాగర్కర్… టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న హీరోయిన్. ‘ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ ‘జాంబీ రెడ్డి’ ‘బంగార్రాజు’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. ‘బంగార్రాజు’ సినిమాలో చాలా పద్దతిగా కనిపించే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈమె నటించి మెప్పించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ‘బంగార్రాజు’ సక్సెస్ మీట్లో నాగ చైతన్యతో స్టేజి పై నవ్వుతూ సైగలు చేసుకున్న వీడియోతో ఈమె ఓ వారం పాటు హాట్ టాపిక్ గా నిలిచింది.

ఈ ఏడాది రవితేజ -సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘రావణాసుర’ చిత్రంలో సుశాంత్ లవర్ గా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.సోషల్ మీడియాలో ఈ అమ్మడికి సూపర్ క్రేజ్ ఉంది. ఈమె ఏ ఫోటో పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇదిలా ఉండగా .. ఆగస్టు 13 న దక్ష తన 25వ పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేసుకుంటుంది. దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఆమె తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంది.

ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు ఆమె షేర్ చేసుకోవడం జరిగింది. ఆ ఫోటోలను గనుక గమనిస్తే.. ఆమె 25 ఫ్లోర్ల కంటే ఎత్తైన బిల్డింగ్ లో ఆమె తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ‘అంటే ఆకాశంలో ఈ అమ్మడు బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె (Daksha Nagarkar) పోస్ట్ చేసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus