బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రతిసారి కూడా సింగర్లు పాల్గొనడం మనం చూస్తున్నాము. ఇలా ప్రతి సీజన్లోనూ ఈ కార్యక్రమంలో సింగర్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక సీజన్ సెవెన్ కార్యక్రమంలో కూడా సింగర్ దామిని కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే దామిని మూడవ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం ఈమె పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దామిని బిగ్ బాస్ కార్యక్రమం గురించి పలు విషయాలు వెల్లడించారు.
బిగ్ బాస్ లో ఉండాలి అంటే కంటెంట్ ఇవ్వాలి అలాగే అప్పుడప్పుడు ఇతరులపై సీరియస్ అవ్వాలి అయితే నేను చేసిన తప్పు అదే నేను హౌస్ లోకి వెళ్లే ముందు తన పిఆర్ టీం కి అన్ని విషయాలు చెప్పాను కానీ నన్ను మాత్రమే హైలెట్ చేయండి ఇతరుల జోలికి వెళ్ళకూడదు అంటూ వారికి చెప్పాను అదే నేను చేసిన తప్పు అయింది అందుకే బయటకు వచ్చేసానని ఈమె తెలిపారు.
ఇక తాను హౌస్ లో ఉన్నప్పుడే రతిక రాహుల్ గురించి పరోక్షంగా నాకు చెప్పింది మేమిద్దరం లవ్ లో ఉన్నాము అంటూ ఆమె నాకు ఇండైరెక్టుగా చెప్పడంతో ఇద్దరు ఒకే ఇండస్ట్రీ కదా నిజమే అనుకొని భావించాను బయటకు వచ్చేసరికి వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రాహుల్ తనకు ఫోన్ చేసి నన్ను కలిసి అసలు విషయాలని చెప్పారు అందుకే ఒక వైపే విని ఎవరిని జడ్జ్ చేయకూడదని దామిని తెలిపారు. ఇక ఉల్టా పుల్టా పేరుతో తిరిగి హౌస్ లోకి వెళ్తానని భావించాను కానీ బిగ్ బాస్ తక్కువ ఓట్లు వచ్చిన రతికను హౌస్ లోకి పంపించారని ఈమె తెలిపారు.
ఇక ప్రస్తుతం ఉన్నటువంటి కంటెస్టెంట్లలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే విషయం గురించి కూడా దామిని ఈ సందర్భంగా మాట్లాడారు. శివాజీ వయసులో అందరికంటే పెద్దవారు ఆయన చాలా అద్భుతంగా మైండ్ గేమ్ ఆడుతున్నారని దామిని వెల్లడించారు. అయితే విన్నర్ మాత్రం శివాజీ కారని తప్పకుండా పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతారు అంటూ ఈ సందర్భంగా ఈమె (Damini) బిగ్ బాస్ విన్నర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.