డీవీవీ దానయ్య , బెల్లంకొండ కు మధ్య గొడవేంటి?

టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అయిన డీవీవీ దానయ్య అలాగే బెల్లంకొండ సురేష్ ల మధ్య గొడవ జరుగుతుందా.. ప్రస్తుతం ఈ విషయం పైనే ఫిలింనగర్ లో పెద్ద చర్చ జరుగుతుంది. నిర్మాత దానయ్య .. బెల్లంకొండ సురేష్ పై కేసు కూడా పెట్టారని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే గతంలో ఓసారి నిర్మాత దానయ్య దగ్గర్నుండీ.. సురేష్ 80 లక్షలు అప్పుగా తీసుకున్నారట. కానీ సురేష్ తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరికీ చెడిందని తెలుస్తుంది.

ఇందు కోసమే నిర్మాత దానయ్య.. బెల్లంకొండ సురేష్ పై కేసు పెట్టినట్టు తెలుస్తుంది. నిజానికి బెల్లంకొండ సురేష్ కు కూడా 80 లక్షలు పెద్ద మ్యాటర్ కాదు. ఇక దానయ్య కూడా ఇంత చిన్న విషయానికి కేసు పెట్టడానికి రెడీ కారు. కేవలం వీరిద్దరి సంభాషణలు సరైన విధంగా లేకపోవడం వల్లనే .. ఇగో క్లాషెస్ జరిగాయని కొంతమంది చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది. ఇక దానయ్య ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బెల్లంకొండ సురేష్ తన కొడుకులతో సినిమాలు నిర్మిస్తూ బిజీగా గడుపుతున్నారు.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus