Amma Rajasekhar, Nithiin: స్టేజ్ పైనే నితిన్ ని తిట్టిపోసిన అమ్మా రాజశేఖర్!

టాలీవుడ్ హీరో నితిన్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. యూత్ ఫుల్ స్టోరీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే నితిన్ కి డాన్స్ రాదని ఓ డాన్స్ మాస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మరెవరో కాదు.. అమ్మా రాజశేఖర్. నితిన్ కి డాన్స్ రాదని, వాడికి డాన్స్ తనే నేర్పించానని.. అలాంటిది ఇప్పుడు తనను మర్చిపోయాడని కామెంట్స్ చేశారు అమ్మ రాజశేఖర్. నితిన్ పై ఓ రేంజ్ లో మండిపడ్డారాయన.

ఒక రకంగా శాప‌నార్థాలు కూడా పెట్టారు. నితిన్ పై అంతగా సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే.. అమ్మ రాజశేఖర్ నిర్మాతగా, హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. దానికి సంబంధించిన ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నితిన్ ని గెస్ట్ గా ఆహ్వానించారు అమ్మ రాజశేఖర్. నితిన్ వస్తానని మాటిచ్చి చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. దాంతో అమ్మ రాజశేఖర్ కి కోపం వచ్చింది. స్టేజ్ పైనే నితిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నితిన్ కోసం గంటల తరబడి కూర్చొని వీడియో చేయించానని.. తను వస్తానని రాలేదని.. రాకపోవడానికి కారణాలు కూడా లేవని అన్నారు. తనకు షూటింగ్ లేదని, ఇంట్లో ఉన్నాడని జ్వరమని అబద్ధం చెప్పాడని అన్నారు. నితిన్ కి డాన్స్ రాదని, తనే నితిన్ కి డాన్స్ నేర్పించానని.. అలాంటి గురువుని మర్చిపోతాడా..? అంటూ ఫైర్ అయ్యారు.

ఆర్టిస్ట్ లు టెక్నిషియన్స్ ను ఫ్రూట్స్ అనుకుంటారని.. తినేసి అవతల పడేస్తారు కానీ వాటి విత్తనాలు మళ్లీ మొలకెత్తుతాయని.. మళ్లీ పండ్లే కాస్తాయని అన్నారు. నితిన్.. మనం మళ్లీ కలుద్దాం అంటూ చిన్నగా వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఈ కామెంట్స్ పై నితిన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం నితిన్ నటిస్తోన్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus