సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దర్బార్’. జనవరి 10న (నిన్న) విడుదలైన ఈ చిత్రానికి డేవిడ్ టాక్ వచ్చింది. మురుగదాస్ ప్రతీ సినిమాలోనూ మంచి కాన్సెప్ట్ ఉంటుంది.. అయితే ‘దర్బార్’ సినిమాలో పూర్తిగా రజినీ ఫ్యాన్ బేస్ మీదే ఆధారపడిపోయాడు. ఫస్ట్ హాఫ్ మంచి ఎంగేజింగ్ గా తెరకెక్కించిన మురుగదాస్… సెకండ్ హాఫ్ ను అంత రసవత్తరంగా నడపలేకపోయాడు. దీంతో మార్నింగ్ షో లు మంచి స్వింగ్ లో ఉన్నపటికీ.. ఈవెనింగ్ షో లకి ఆ జోరు తగ్గిపోయింది. ఈ క్రమంలో మొదటి రోజు డీసెంట్ కలెక్షన్లను మాత్రమే ‘దర్బార్’ రాబట్టింది.
‘దర్బార్’ తెలుగు రాష్ట్రాల మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
2.10 cr
సీడెడ్
0.70 cr
ఉత్తరాంధ్ర
0.44 cr
ఈస్ట్
0.28 cr
వెస్ట్
0.18 cr
కృష్ణా
0.24 cr
గుంటూరు
0.40 cr
నెల్లూరు
0.18 cr
ఏపీ + తెలంగాణ
4.52 cr(share)
‘దర్బార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం 4.52 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 10 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రజినీ గత చిత్రాలు ‘2.ఓ’ 12.5 కోట్లు, ‘కబాలి’ 9.3 కోట్లు వరకూ మొదటి రోజు షేర్స్ ను రాబట్టాయి. కానీ ‘దర్బార్’ 4.52 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టడం గమనార్హం.