‘దర్బార్’ క్లోజింగ్ కలెక్షన్స్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దర్బార్’. జనవరి 11 న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ చిత్రం మొదటి షోతోనే డివైడ్ టాక్ ను మూట కట్టుకోడంతో కలెక్షన్ లు ఆశించిన స్థాయిలో నమోదు చేయలేకపోయింది. తెలుగులో ఈ చిత్రానికి మొదటి రెండు రోజులు సోలో రిలీజ్ దక్కినప్పటికీ.. క్యాష్ చేసుకోలేకపోయింది.

ఇక ఈ చిత్రం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 5.05 cr
సీడెడ్ 1.08 cr
ఉత్తరాంధ్ర 1.09 cr
ఈస్ట్ 0.67 cr
వెస్ట్ 0.47 cr
కృష్ణా 0.73 cr
గుంటూరు 0.58 cr
నెల్లూరు 0.42 cr
ఏపీ + తెలంగాణ 10.09 cr(share)

‘దర్బార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 10.09 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే మొత్తంగా ఈ చిత్రానికి 4.11కోట్ల వరకూ నష్టం వచ్చింది. గతంలో రజినీ కాంత్, సూర్య చిత్రాలకు విపరీతమైన మార్కెట్ ఉండేది. డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ ఇక్కడి టాప్ హీరోలతో సమానంగా కలెక్షన్లను రాబట్టేవి. ఆ టైములో తమిళ హీరోలు విజయ్, కార్తీ హవా అంత ఉండేది కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. విజయ్, కార్తీ వంటి హీరోల సినిమాలకు ఇక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. రజినీ, సూర్య ల మార్కెట్ మాత్రం పడిపోయింది. మరి వీరి తరువాత సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Click Here to Read Darbar Movie Review

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus