Srikanth Odela: దసరా దర్శకుడి పెళ్లికి వాళ్లకు మాత్రమే ఆహ్వానం అందిందా?

దసరా సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో శ్రీకాంత్ ఓదెల పేరు మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడైన ఈ దర్శకుడు ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీకాంత్ ఓదెల పెళ్లి ఈరోజు గ్రాండ్ గా జరిగిందని సమాచారం. పెద్దగా ప్రచారం లేకుండానే ఈ దర్శకుడు పెళ్లి కొడుకు అయ్యాడు. కరీంనగర్ లోని ప్రముఖ ఫంక్షన్ హాల్ లో ఈ దర్శకుడి వివాహం గ్రాండ్ గా జరిగింది.

దసరా సినిమా సాధించిన విజయంతో మరింత ఆనందంతో ఈ దర్శకుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సినిమా ఇండస్ట్రీ నుంచి పరిమిత సంఖ్యలో సెలబ్రిటీలకు ఆహ్వానం అందిందని సమాచారం. తనతో సన్నిహితంగా మెలిగే సెలబ్రిటీలను మాత్రమే శ్రీకాంత్ పెళ్లికి పిలిచారని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన, నాని, కీర్తి సురేష్ లకు ఆహ్వానం అందింది.

దసరా సినిమాకు పని చేసిన యూనిట్ సభ్యులు కూడా ఈ వివాహానికి హాజరైనట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల భార్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ డైరెక్టర్ కు భారీ సంఖ్యలో ఆఫర్లు వస్తుండగా త్వరలో కొత్త సినిమాలను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. శ్రీకాంత్ ఓదెల వివాహ జీవితం బాగుండాలని అభిమానులు కోరుకుంటున్నారు. దసరా సక్సెస్ తో ఈ దర్శకుని రెమ్యునరేషన్ కూడా పెరిగిందని బోగట్టా.

ఒక సినిమాకు దర్శకత్వం వహించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పి (Srikanth Odela) ఈ దర్శకుడు ఇంతకాలం పెళ్లిని వాయిదా వేశారని సమాచారం. దసరా సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఈ సినిమాతో ప్రశంసలు అందుకోవడంతో ఈ సినిమా విడుదలైన తర్వాత శ్రీకాంత్ ఓదెల పెళ్లికి సిద్ధమై ఓ ఇంటివాడయ్యారు. శ్రీకాంత్ ఓదెలకు రాబోయే రోజుల్లో కూడా వరుస విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus