Chiranjeevi: శ్రీకాంత్ ఓదెలకి చిరంజీవి ఛాన్స్ ఇవ్వబోతున్నారా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే మూవీలో నటిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది. శ్రీముఖి కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. గతేడాది మూడు రెండు సినిమాలు విడుదల చేసిన చిరంజీవి..

ఈ ఏడాది కూడా రెండు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసమే వరుసగా కథలు వింటున్నారు. గోపీచంద్ మలినేని, కళ్యాణ్ కృష్ణ కురసాల, బి.వి.ఎస్.రవి వంటి దర్శకులు చెప్పిన కథలు విన్నారు. అందులో బి.వి.ఎస్.రవి కథకు ఓకే చెప్పారు. అయితే ఆ కథని వేరే దర్శకుడితో చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇటీవల ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా చిరంజీవికి ఓ కథ చెప్పారు. దాదాపు 2 గంటల పాటు ఇంట్రెస్టింగ్ గా కథ విన్నారు చిరు.

శ్రీకాంత్ కు ఇంకా ఏ విషయం చెప్పలేదు అని వినికిడి. ఈ కథ కూడా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసే విధంగా ఉందని మాత్రం ఇన్సైడ్ టాక్. చిరు (Chiranjeevi) కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ..వారి కథలకు ఓకే చెబుతున్నప్పటికీ అవి సెట్స్ పైకి వెళ్తాయన్న గ్యారెంటీ అయితే లేదు. ‘భీష్మ’ దర్శకుడితో సినిమా అన్నారు.. దాని గురించి ఊసే లేదు. లూసిఫర్ రీమేక్ సుజీత్ దర్శకత్వంలో చేయాలి. అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల మూవీ గురించి కూడా అభిమానులు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదేమో..!

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus