Devara: దేవర సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కీలకపాత్రలో దసరా నటుడు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.ఇక ఈ పోస్టర్ చూస్తేనే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించగా ఎన్టీఆర్ కి పోటీగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నారు.

అలాగే బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఎన్టీఆర్ కు జోడిగా ఈ సినిమాలో నటిస్తూ సౌత్ ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇలా ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నారన్న విషయం తెలిసి ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈయన ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. మలయాళీ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి షైన్ తాజాగా నాని నటించిన దసరా సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.

ఇక ఈ సినిమా (Devara) ద్వారా ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో తెలుగులో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన నాగశౌర్య నటిస్తున్న రంగబలి అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అదేవిధంగా పరోక్షంగా తాను ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి దేవర సినిమాలో కూడా నటించబోతున్నానని ఈయన చెప్పకనే చెప్పేశారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus