David Warner: మొదటిసారి సినీ ఎంట్రీ పై స్పందించిన డేవిడ్ వార్నర్!

ప్రముఖ క్రికెటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే క్రికెటర్లకు సినిమా ఇండస్ట్రీ వారికి ఎంతో మంచి అనుబంధం ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ తనకు ఉన్నటువంటి సినిమాల పిచ్చిని పలు సందర్భాలలో బయటపెట్టారు. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ పాటకు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.

ఇలా డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి ఈ పాటకు డాన్స్ వేయడమే కాకుండా తరచూ పలు సినిమాలలోని పాటలకు డ్యాన్సులు చేయడమే కాకుండా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సినిమాలపై తనకు ఉన్నటువంటి ఆసక్తిని తెలియజేస్తున్నారు. ఇలా ఈయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండడం గమనించిన అభిమానులు డేవిడ్ వార్నర్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై మొదటిసారి డేవిడ్ వార్నర్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ..సినిమా ఇండస్ట్రీపై తనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు. తాను ఇండస్ట్రీలోకి వస్తే మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో సినిమా చేస్తానని తెలియజేశారు. ఇక తన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన విలన్ పాత్రలలోనే నటిస్తానని తెలియజేశారు.

ఎందుకంటే తనకు విలన్ పాత్రలో సెట్ అవుతాయని (David Warner) డేవిడ్ వార్నర్ వెల్లడించారు. ఇక తాను చేసే సినిమాలలో రష్మిక మందన్న హీరోయిన్ గా ఉండాలని ఈయన తన మనసులో కోరికను బయటపెట్టారు. ఇలా డేవిడ్ వార్నర్ సినిమా ఎంట్రీ గురించి హీరోయిన్ రష్మిక గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus