ముంబైలో డాన్ గా ఎదిగి ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా దావూద్ ఇబ్రహీం మారారు. 1993 ముంబై పేలుళ్లలో సూత్రధారిగా ఉన్న దావూద్, ఆ సంఘటన తరువాత దేశం వదిలిపారిపోయారు. పాకిస్థాన్ దేశంలో తలదాచుకున్న దావూద్ ని ఎంత ప్రయత్నించినా భారత్ పట్టుకోలేక పోయింది. ఆ దేశం అండతో దావూద్ హ్యాపీగా బ్రతికేస్తున్నాడు. ఎక్కడ ఉన్నా భారత్ పై కుట్ర పన్నుతూ ఉంటారు. ఇక ముంబై నుండి పారిపోక ముందు దావూద్ ఇబ్రహీం బాలీవుడ్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు.
సినిమాలలో పెట్టుబడులు కూడా పెట్టేవారు. అలాగే అనేక మంది బాలీవుడ్ హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపారు. తాజాగా ఆయన మరో హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ నటి మెహ్విష్ హయత్ తో దావూద్ సన్నిహితంగా ఉంటున్నారట. వీరి మధ్య కొన్నాళ్లుగా ఎఫైర్ నడుస్తుందని ఇంటర్నేషన్ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.
ఇటీవల పాక్ ప్రభుత్వం నుండి ఆమెకు నటులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దక్కింది. అంతగా పాపులారీ లేని ఆమెకు ఆ పురస్కారం దక్కడంతో అందరు షాక్ అయ్యారట. దీనితో మెహ్విష్ హయత్ కి ఆ అవార్డు దక్కడం వెనుక దావూద్ ప్రమేయం ఉందన్న మాట వినిపిస్తుంది.