ప్రీ రిలీజ్ అదిరింది విజయ్.. కానీ ‘ఇస్మార్ట్’ తగ్గుతాడా?

  • July 24, 2019 / 06:05 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్షన్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘బిగ్ బెన్ సినిమాస్’ బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రం జూలై 26 న తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇక జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో వచ్చిన పాటలకి కూడా మంచి స్పందన లభించింది. మ్యూజిక్ ఫెస్టివల్ అంటూ ఈ చిత్రాన్ని సౌత్ మొత్తం బాగా ప్రమోట్ చేసాడు హీరో విజయ్ దేవరకొండ. అందుకే ఈ చిత్రానికి భారీ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి 34.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక ‘డియర్ కామ్రేడ్’ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 9 కోట్లు
సీడెడ్ – 3.6 కోట్లు
వైజాగ్ – 2.4 కోట్లు


ఈస్ట్ – 1.8 కోట్లు
కృష్ణా – 1.6 కోట్లు
గుంటూరు – 2.0 కోట్లు


వెస్ట్ – 1.40 కోట్లు
నెల్లూరు – 0.80 కోట్లు
———————————————————–
ఏపీ+నైజాం టోటల్ – 22.60 కోట్లు


రెస్ట్ ఆఫ్ ఇండియా – 8 కోట్లు (అన్ని భాషలు కలిపి)
ఓవర్ సీస్ – 4 కోట్లు
————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 34.60 కోట్లు
————————————————————-

‘గీత గోవిందం’ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రానికి మొదటి నుండీ మంచి హైప్ ఏర్పడింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే… 35 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఓకే.. లేదంటే ఆడియన్స్ కు ఎలాగూ ‘ఇస్మార్ట్ శంకర్’ అనే ఒక ఉంది. విజయ్ గత సినిమాలు అల్లు అరవింద్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరుండి చూసుకున్నాడు కాబట్టి.. అవి అంత పెద్ద హిట్లయ్యాయి. కానీ ఈసారి మాత్రం విజయ్ వన్ మ్యాన్ షో చేయాల్సి ఉంది. మరి ఈ చిత్రం విజయ్ దేవరకొండ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus