Dear Megha Movie: ‘డియర్ మేఘ’ కి ‘అందాల రాక్షసి’ ‘దియా’ సినిమాలకి ఉన్న పోలిక?

అదేంటో మన తెలుగులో కొత్త కథలు రావు అని కొంత మంది అంటుంటారు. మరికొంత మంది అయితే కొత్త కథలు వచ్చినా మన ప్రేక్షకులు చూడరు అంటుంటారు. చూస్తుంటే రెండో లైన్ కరెక్ట్.. అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టు.. మన జనాలు చాలా వరకు ఇదే బాటలో నడుస్తున్నారు. మన దగ్గర ‘1 నేనొక్కడినే’ వంటి సినిమా వస్తే వాళ్ళకి రుచించలేదు. కానీ తమిళ థ్రిల్లర్ మూవీస్ బాగా నచ్చేస్తాయి. ‘అవి తోపు.. తురుము’ అంటూ కితాబిస్తారు.ఈ మధ్యన మేకర్స్ కూడా అలాగే తయారయ్యారు.

మన తెలుగులో తీసిన ‘వాంటెడ్’ ‘ఊసరవెల్లి’ ల మూవీలనే కాస్త అటు ఇటు చేసి ‘వేదాళం’ గా తమిళ్ లో తీస్తే దానిని మళ్ళీ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఏం చెబుతాం లెండి. ఇలాంటివి లెక్కలు వేసుకుంటే చాలానే ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. మన తెలుగులో ‘అందాల రాక్షసి’ అనే చిత్రం వచ్చింది.హను రాఘవపూడి వంటి దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజమౌళి, దిల్ రాజు లు ఏరి కోరి డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఆ సినిమాని మన తెలుగు ప్రేక్షకులు బాలేదు అన్నారు. ప్లాప్ చేశారు.

అదే థీమ్ తో కన్నడ తంబీలు ‘దియా’ మూవీని రూపొందిస్తే.. మన జనాలు ఓటిటిల్లో ఎగబడి చూసారు. ఆ మూవీ సూపర్ అంటూ ప్రశంసించారు. అక్కడితో అయిపోతే పర్వాలేదు.. మన తెలుగు మేకర్స్ కు అలాంటి సినిమా తీయడం రాదు అంటూ తిట్టిపోశారు. అలాంటి కామెంట్లు చూసే అనుకుంట.. ‘డియర్ మేఘ’ ను తెరకెక్కించారు మన మేకర్స్. ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. చాలా వరకు ఇది ‘అందాల రాక్షసి’ థీమ్ తో రూపొందితే ‘దియా’ తో పోల్చి విమర్శిస్తున్నారు మన ప్రేక్షకులు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus