Dear Megha Teaser: ఆకట్టుకుంటున్న మేఘా ఆకాష్ ‘డియర్ మేఘ’ టీజర్..!

నితిన్ హీరోగా వచ్చిన ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మేఘా ఆకాష్.. అనతికాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. విభిన్న కథాంశం కలిగిన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈమె టైటిల్ రోల్ పోషిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘డియర్ మేఘ’.ఆదిత్ అరుణ్ మరియు అర్జున్ సోమయాజుల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా… ‘వెదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ అయిన ‘ఆమని ఉంటే’ అనే లిరికల్ సాంగ్ ని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే లాంచ్ చేయగా దానికి మంచి స్పందన లభించింది. ఇప్పటికే యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసిన ఈ పాట సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసిందనే చెప్పాలి. ఇక ఆగష్ట్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. మేఘా స్వరూప్(హీరోయిన్ మేఘా ఆకాష్) అనే అమ్మాయి.. ఆమె లైఫ్ లో ఉన్న ప్రేమ కథలు మరియు ఆమె స్ట్రగుల్స్ గురించి తెలియజేస్తూ టీజర్ ను కట్ చేశారు.

హీరోయిన్ మేఘా ఆకాష్ హావ భావాలూ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘నాకు లవ్ లో పి.హెచ్.డి ఉంది’ అంటూ ఆమె పలికిన డైలాగ్ ఎంతో ఉత్సాహ భరితంగా ఉంది. అలాగే హీరో ఆదిత్ చెప్పిన.. ‘లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతకడం కాదు.. ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకుంటూ బ్రతకడం’ అనే డైలాగ్ ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. ఆండ్రూ అందించిన సినిమాటోగ్రఫీ , గౌరా హరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి హైలెట్ గా నిలిచాయని చెప్పొచ్చు.మొత్తానికి ‘డియర్ మేఘ’ టీజర్ ఆకట్టుకునే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :


‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus