సినీ పరిశ్రమలో అవకాశం సంపాదించడం అంత ఈజీ కాదు. ఒకసారి అవకాశం వచ్చాక దానిని సద్వినియోగ పరుచుకోవడం కూడా సాధారణ విషయం కాదు. ముఖ్యంగా దర్శకుల దగ్గర అసిస్టెంట్ లుగా చేస్తూ డైరెక్షన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అదృష్టం కలిసొచ్చి.. డైరెక్షన్ ఛాన్స్ వచ్చినా.. దానిని సద్వినియోగపరుచుకుని హిట్టు కొట్టలేకపోయిన దర్శకులు కూడా కొంతమంది ఉన్నారు.దర్శకులు కావాలనుకునేవారికి ఇక్కడ మొదటి అవకాశం రావడమే చాలా కష్టం అని అంతా అంటుంటారు. కానీ మొదటి ఛాన్స్ వచ్చినప్పుడు.. సక్సెస్ అందుకోకపోతే రెండో ఛాన్స్ రావడం అంతకు మించి కష్టమనే చెప్పాలి. గత రెండేళ్లలో చాలా మంది కొత్త డైరెక్టర్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఆ క్రేజీ ఛాన్స్ ను వాళ్ళు వాడుకోలేకపోయారు అనే చెప్పాలి. ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) కిషోర్.బి :
శర్వానంద్ తో ‘శ్రీకారం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ యంగ్ డైరెక్టర్.’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంత గొప్ప ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు. కానీ సినిమా ఆడలేదు. కిషోర్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు అయ్యింది.
2) కౌశిక్ పెగళ్ళపాటి :
‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రాన్ని తెరకెక్కించే ఛాన్స్ దక్కించుకున్నాడు నూతన దర్శకుడు కౌశిక్. మినిమమ్ గ్యారెంటీ అని అంచనా వేసిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
3) భరత్ కమ్మ :
విజయ్ దేవరకొండ తో ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు ఇతను. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. దీంతో భరత్ కూడా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.
4) ఆశిషోర్ సాల్మన్ :
‘వైల్డ్ డాగ్’ చిత్రంతో డైరెక్టర్ గా మారిన ఈ డైరెక్టర్ విమర్శకులను మెప్పించాడు కానీ.. కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
5) నరేష్ కుప్పిలి :
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడితను. కానీ ఈ మూవీ సక్సెస్ అందుకోలేదు.బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రానికి దర్శకుడు. నరేష్ కు రెండో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది.
6) లక్ష్మీ సౌజన్య :
నాగ శౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమైంది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈమెకు రెండో ఛాన్స్ వెంటనే రాకపోవడంతో ‘మా నీళ్ల ట్యాంక్’ అనే ఓటిటి ప్రాజెక్టుని డైరెక్ట్ చేసింది.
7) కిరణ్ కొర్రపాటి :
వరుణ్ తేజ్ హీరో, అల్లు బాబీ నిర్మాత.. ఇంతకంటే గోల్డెన్ ఛాన్స్ ఉంటుందా. కానీ ‘గని’ తో హిట్టు కొట్టలేకపోయాడు కిరణ్.
8) సాంటో :
రాజ్ తరుణ్ తో ‘స్టాండప్ రాహుల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కూడా క్రేజీ ప్రాజెక్టు. కానీ డైరెక్టర్ సాంటోకి కలిసి రాలేదు.
9) శరత్ మండవ :
రవితేజ తో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతకు ముందు తమిళ్ లో ఓ సినిమాని డైరెక్ట్ చేసినా.. తెలుగులో ఇతనికి ఇదే మొదటి సినిమా. కానీ ఈ సినిమా నిరాశపరిచింది.
10) ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి :
నితిన్ తో ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా నిరాశపరిచింది. ఇతను కూడా రెండో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు.