Deepika Remuneration: ప్రభాస్ సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన దీపిక.. ఎన్ని కోట్లంటే!

యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మాణంలో ప్రాజెక్టుకి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ద్వారా దీపికా పదుకొనే మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇలా పాన్ ఇండియా సినిమా కావడంతో భారీ బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో చిత్రీకరణ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాలో మరొక బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

ఈ సినిమా కోసం నటి దీపికా పదుకొనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఈమె ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని అశ్విని దత్ ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదల చేయడానికి భారీ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus