Deepika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె గతంలో ఎన్నో సార్లు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించినట్టు సంచలన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. “కారణం లేకుండానే ఏడుస్తూ ఉండేదాన్ని. ప్రెజర్ నుండి తప్పించుకోవాలని ఎక్కువగా నిద్రపోవడానికి ప్రయత్నించేదాన్ని. సూసైడ్ చేసుకోవాలని చాలా సార్లు అనిపించేది. అయితే ఆ టైంలో నాకు మా అమ్మ తోడుగా ఉండి ధైర్యం చెబుతుండడం వల్ల ఒత్తిడిని అధిగమించేదాన్ని” అంటూ దీపికా పడుకోణె చెప్పుకొచ్చింది. ఒత్తిడితో బాధపడే వారి కోసం ఆమె ‘లైవ్ లవ్ లాఫ్’ అనే ఫౌండేషన్ ను నడుపుతున్న సంగతి తెలిసిందే.

డిప్రెషన్ సమస్యలతో బాధపడే వారి కోసం దీపికా పడుకోణె ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ‘సర్కస్’ ‘బ్రహ్మాస్త్ర’ ‘పఠాన్’ ‘జవాన్’ వంటి హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది దీపికా పడుకోణె. ఒక్కో సినిమాకు ఆమె రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఆమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా..కి ఇది టాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2023 అక్టోబర్ లో కానీ 2024 జనవరిలో కానీ ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు అశ్వినీదత్ వెల్లడించారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus