Jr NTR, Deepika: ప్రశాంత్‌ – తారక్‌ సినిమాలో హీరోయిన్‌గా దీపిక!

బాలీవుడ్‌ హీరోయిన్‌ను టాలీవుడ్‌ సినిమాలో నటింపజేయాలి అంటే అంత ఈజీగా కాదు. భగీరద ప్రయత్నం లాగా… చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందులో ఫుల్‌ మాస్ మసాలా సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ను నటింపజేయాలి అంటే ఇంకా కష్టం. అందులోనూ అక్కడి స్టార్‌ హీరోయిన్‌తో సినిమా అంటే ఇంకా ఇంకా కష్టం. అయితే ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కలసి ఈ పని చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

చాలా రోజుల క్రితమే రూమర్‌గా మొదలైన ఈ సినిమా, ఆ తర్వాత కన్‌ఫామ్‌ అయ్యింది. అయితే అటు ప్రశాంత్‌ నీల్‌, ఇటు తారక్‌ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు సినిమా గురించి మళ్లీ ఇప్పుడు చర్చ మొదలైంది. ‘సలార్‌’ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని ప్రశాంత్‌ నీల్‌ చెప్పేశారు. దీంతో సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్‌ రూపొందినుంది.

అంతేకాదు ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజిలో ఉంటుందంటున్నారు కూడా. దీంతో ఇందులో నటీనటులు ఇతర భాషల్లోని స్టార్లే అవుతారు అని లెక్కలేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో దీపికా పడుకొణె నటిస్తోందని వార్త వైరల్‌గా మారింది. దీపిక తెలుగులో నటిస్తే బాగుంటుందని అని అందరూ కోరుకుంటారు. కానీ హీరో ప్రాధాన్యమున్న సినిమాలో ఆమె నటించడం అంటే కష్టమే అని చెప్పొచ్చు. ‘ప్రాజెక్ట్‌ K’ సినిమాలో నటిస్తోంది కదా అని అంటారా? ఆ సినిమాలో ఆమె పాత్ర నేపథ్యం కొత్తగా, పెద్దగా ఉంటుందట.

అందుకే ఆ సినిమా ఒప్పుకుంది అని చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్‌ సినిమాలో కూడా దీపికకు మంచి రోల్‌ పడితే కచ్చితంగా చేస్తుంది అని చెప్పేయొచ్చు. అయితే ఇలాంటి పాత్రలు రాయడంలో ప్రశాంత్‌ నీల్‌ది అందవేసిన చేయి. ఆయన గత చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. సో ఎన్టీఆర్‌తో దీపిక పడుకొణె అనే మాట నిజమయ్యేలానే ఉంది. తారక్‌ – ప్రశాంత్‌ సినిమాలో దీపిక అనే వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది, కనిపిస్తోంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని అక్టోబర్‌ నుండి ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అక్టోబర్‌ రెండో వారం నుండి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారట. కాబట్టి ఆ సమయానికల్లా సినిమాలో హీరోయినపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus