మాల్దీవుల్లో మంటలు రేపుతున్న దీపిక పిల్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

దీపిక పిల్లి గురించి నెటిజన్లకు కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఈ సోషల్ మీడియా స్టార్ నెట్టింట రచ్చ లేపుతోంది. రీసెంట్‌‌గా వెకేషన్‌కి మాల్దీవ్స్ వెళ్లిన దీపిక.. అక్కడి సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ.. పొట్టిగౌనులో ఓ వీడియో చేసి వదిలింది.. యూత్ పోరగాళ్లంతా ఇంకా ఆ వీడియో చూసిన షాక్‌లో ఉండగానే.. ఇప్పుడు కొన్నిలేటెస్ట్ పిక్స్ పోస్ట్ చేసి, వాళ్ల నేత్రానందాన్ని డబుల్, ట్రిపుల్ చేసేసింది.. ‘గుడ్ ఫుడ్.. గుడ్ మూడ్’ అంటూ ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

బ్లాక్ డ్రెస్‌లో అందాల విందు చేస్తూ అమ్మడు అలా నీటిమీద తేలియాడుతూ ఉంటే కుర్రాళ్ల గుండెలు గాల్లో బెలూన్లలా ఎగిరిపోతున్నాయి. ప్రస్తుతం దీపిక మాల్దీవ్స్ టూర్ పిక్స్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాతో వచ్చిన పాపులారీటీతో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దీపిక ఆ తర్వాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో హీరోయిన్‌గా చేసింది.

సుడిగాలి సుధీర్ సరసన నటించిన దీపికాను దర్శకేంద్రుడు తన స్టైల్లో ఎంత గ్లామరస్‌గా చూపించారో తెలిసిందే.. సినిమా పెద్దగా ఆడలేదు కానీ బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనే తన కోరిక మాత్రం తీర్చుకుంది దీపిక పిల్లి..

1

2

3

4

5

6

7

8

 

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus