సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. ఈ మధ్యకాలంలో కరోనా కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ అర్ధం పర్ధం లేని సినిమాలను చేస్తూ క్యాష్ చేసుకుంటున్న ఏకైక దర్శకుడు రాంగోపాల్ వర్మ. పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ ‘పవర్ స్టార్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి ఆయన అభిమానుల్ని ఓ రేంజ్లో కెలికేసాడు.అనేక టీవీ లైవ్ షోలో ఇంటర్వ్యూలు ఇచ్చి.. వాళ్ళను మరింతగా రెచ్చగొట్టాడు.
ఇక ఆ సినిమాలో మొదటి నుండీ పవన్ కళ్యాణ్.. మరియు అతని అభిమానుల పై ఓ రేంజ్లో సెటైర్లు వేసి.. కావాల్సిన పబ్లిసిటీ సంపాదించుకున్నాడు. మొత్తానికి ఆ చిత్రం వర్మకు కోటిన్నర పైనే మిగిల్చింది. సరే ఇక వర్మ ఆస్తుల వివరాలు ఎంత ఉండి ఉండచ్చు? అనే డిస్కషన్ చాలా రోజులుగా నడుస్తుంది.వీటి గురించి వర్మ ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. రాంగోపాల్ వర్మ ఆస్తులు 110 కోట్ల నుండీ 120 కోట్ల మధ్యలో ఉంటుందని వినికిడి.
ఇతనికి చాలా ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ క్లాస్ అనే కారు కూడా ఉంది. హైదరాబాద్ లో సొంత ఇల్లు, ఆఫీస్ తో పాటు నార్త్ లో కూడా ఈయనకు స్థలాలు ఉన్నట్టు వినికిడి. ఆ రకంగా రాంగోపాల్ వర్మ ఆస్తుల లెక్క కూడా ఎక్కువే..! ఇక వర్మ .. ప్రస్తుతం ‘మర్డర్’ ‘త్రిల్లర్’ వంటి చిత్రాలతో పాటు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పై సెటైర్లు వేస్తూ ‘అల్లు’ అనే చిత్రం తెరకెక్కించడానికి కూడా రెడీ అయ్యాడు.