బిగ్‌బాస్‌ 4: ఈ రోజు చేసే రెండో ఎలిమినేషన్‌ నిజమేనా…?

ఫేక్‌ ఎలిమినేషన్‌… బిగ్‌బాస్‌లో ఇది కొత్తేం కాదు. కీలకంగా మారుతున్న వ్యక్తి ఎలిమినేట్‌ కాకుండానే బయటకు తీసుకొచ్చి వేరే గదిలో ఉంచుతారు. గత సీజన్లలో రాహుల్‌ సిప్లిగంజ్‌, ముమైత్‌ ఖాన్‌ ఇలా బయటకు వెళ్లి వచ్చినవాళ్లే. బయటకు అంటే… బిగ్బాస్‌ హౌస్‌లోనే వేరే గదికి. అక్కడ కొన్ని రోజులు ఉండి ఇంట్లో వాళ్లను గమనించి మళ్లీ రావొచ్చు. అయితే ఇలా వచ్చినవాళ్లకు అడ్వాంటేజ్‌, డిస్‌ అడ్వాంటేజ్‌ కూడా ఉంటాయి. ఆ విషయం పక్కనపెడితే ఇంట్లో మాత్రం మూడ్‌ మారిపోతుంది. సిచ్యువేషన్లు మారుతాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనే కదా.. ఎందుకంటే ఈ రోజు అలాంటి ఫేక్‌ ఎలిమినేషన్‌ ఒకటి ఉండబోతోంది.

ఈ వారం రెండు ఎలిమినేషన్లు ఉంటాయని నాగార్జున ముందే చెప్పేశాడు. అందరూ గంగవ్వ, కళ్యాణి ఎలిమిటనేట్‌ అవుతారని అనుకుంటే… తొలుతే గంగవ్వను సేఫ్‌ చేసేసి షాక్‌ ఇచ్చాడు నాగ్‌. ఆ తర్వాత కళ్యాణిని ఎలిమినేట్‌ చేసేశాడు. ఇక రెండో ఎలిమినేషన్‌ ఎవరూ అంటూ అందరినీ ఆలోచనలో పడేశాడు. అసలు రెండో వారంలోనే డబుల్‌ ఎలిమినేషన్‌ ఏంటి అని ఆశ్చర్యపోయారు. దీనినే ఇప్పుడు బిగ్‌బాస్‌ టీమ్‌ క్యాష్ చేసుకోవాలని అనుకుంటోంది. ఈ రెండో ఎలిమినేషన్‌ని ఇంట్లో డ్రామాను పెంచడానికి వాడుకుంటారట. ఆ డ్రామాను పెంచేది ఎవరో కాదు బిగ్‌బాస్‌ ‘రౌడీబేబీ’ హారిక. అవును ఆమెనే ఈ వారం ఫేక్‌ ఎలిమినేషన్‌లో బయటకు వెళ్లేది.

మామూలుగా అయితే ఇలాంటి ఫేక్‌ ఎలిమినేషన్‌ను స్ట్రాంగ్‌ కంటెంస్టెంట్లకు చేస్తారు. గత సీజన్లలో ఇలాంటివి మనం చూశాం. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌ దానికి ఉదాహరణ. మరిప్పుడు నాలుగో సీజన్‌లో హారిక అంత స్ట్రాంగ్‌ పార్టిసిపెంట్‌ అని అనుకుంటున్నారా. లేక ఆమెను సీక్రెట్‌ రూమ్‌లో పెట్టి ఇంకా వినోదం పొందొచ్చు అనుకుంటున్నారా అనేది రేపటి నుంచి తెలుస్తుంది. చూద్దాం అసలు ఈ రోజు నాగ్‌ ఇదే పని చేస్తాడా? లేక మరో ట్విస్ట్‌ ఇస్తాడా?

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus