తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇద్దరు… తమ తమ పార్టీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన అనేక అంశాలు, చర్చలు, వాదోపవాదాలు అందరికీ తెలిసినవే. అయితే రాజకీయాల్లోకి రాకముందు వీరిద్దరూ ఎలా ఉండేవారు అనేది ఇంకా ఆసక్తికరం. ఇప్పుడు ఆ విషయాలన్ని సిరీస్ రూపంలో తీసుకొస్తా అంటున్నారు ప్రముఖ దర్శకుడు దేవా కట్టా.
నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాల ఆధారంగా చేసుకుని ఓ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారట దేవా కట్టా. ఆ ఇద్దరు నాయకుల కాలేజీ జీవితాలను ఇందులో చూపించబోతున్నారట. ఆ తర్వాత రాజకీయాల్లోకి అరంగేట్రం, నాయకులుగా ఆవిర్భావం… ఇలా వివిధ దశలను చూపిస్తారట. వై.ఎస్ మరణం వరకు ఈ కథ సాగుతుందట. అంతేకాదు ఈ సినిమాని ‘గాడ్‌ఫాదర్’ తరహాలో ‘ఇంద్రప్రస్థం’ పేరుతో మూడు భాగాలుగా తెరకెక్కించాలనుకుంటున్నారట దేవా కట్టా.
రాజకీయాలను, రాజకీయ నాయకుల జీవితాలను వెండితెరపై తీసుకొస్తే ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో నిజాలను నిజాలుగా చూపించకపోతే ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఇద్దరు నాయకులకు చెందిన పార్టీలే కీలకంగా ఉన్నాయి. ఈ సమయంలో దేవా కట్టాకు ఈ సినిమా కత్తి మీద సామే. మరి ఈ సినిమాను (సినిమాలు) ఎలా చేస్తారు అనేది చూడాలి.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!