Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

బయోపిక్స్‌ గురించి చాలామందికి ఉన్న అతి పెద్ద డౌట్‌.. ‘ఇది నిజంగా జరిగిందేనా?’. ఈ డౌట్‌ ఎందుకొచ్చింది, అసలు ఇలా ఎలా అంటారు అని ఎవరూ అనకపోవచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తి జీవిత కథ సినిమాగా వస్తున్నా.. అందులో జెన్యూనిటీ విషయంలో డౌట్స్‌ అయితే కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని స్టార్‌ దర్శకుడు ఒకరు స్టేజీ మీదే ప్రస్తావించారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అన్నట్లు ఇప్పుడు ఆయన నిజ జీవితానికి దగ్గరగా ఉన్న కథనే ఓ సినిమా సిద్ధం చేశారు.

Deva Katta

ఇంత ఓపెన్‌గా బయోపిక్‌లపై ఇప్పుడెందుకు కామెంట్లు చేశారు అనే డౌట్‌ మీకు వచ్చి ఉండొచ్చు. మీకే కాదు అందరికీ ఇదే డౌట్‌ ఉంది. ఈ కామెంట్లు చేసిన దర్శకుడు దేవా కట్టా. అవును త్వరలో ‘మయసభ’లో సోనీ లివ్‌లోకి రానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగానే ఆయనలా మాట్లాడారు. ఆగస్టు 7 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానున్న నేపథ్యంలో సినిమా కథ లైన్‌ని కూడా చెప్పారు. ఇద్దరు స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారనే కథాంశంతో ఈ సినిమా రూపొందించినట్లు చెప్పారు. ఇదంతా సోషల్‌ మీడియాలో జరిగిన చర్చ.

దేవా కట్టా.. మీరు ‘క్రియేటివ్‌’ అని చెప్పినా ప్రజలు క్రియేటివిటీ వెనుక ఏదో రియాల్టీ ఉంది అంటున్నారు అని సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దానికి దేవా కట్టా స్పందిస్తూ… ‘‘ఓపెన్‌గా బయోపిక్‌ అని ప్రకటించిన కథలు కూడా కల్పితాలే కదా. 80 ఏళ్ల ఒక వ్యక్తి జీవితాన్ని ఎవరైనా మూడు గంటల సినిమాగా చెప్పగలరా? కల్పితం లేకుండా కథ చెప్పగలరా అని తిరిగి ప్రయత్నించారు. దీంతో గతంలో వచ్చిన బయోపిక్‌లు ఎంతవ కల్పితం కావు అనే చర్చ మొదలైంది.

ఎందుకంటే మన దగ్గర రాజకీయ నాయకుల బయోపిక్‌లు కొన్ని వచ్చాయి. వాటిలో చూపించిందంతా నిజమేనా? అనే చర్చ కూడా జరిగింది. ఇప్పుడు దేవా కట్టా మాటలు అప్పటి చర్చలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. దేవా కట్టా ఏ ధైర్యంతో ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు అనే చర్చ కూడా మొదలైంది.

బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus