దేవదాస్ దూకుడుకి నోటా అడ్డుగా మారనుందా?

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్ మొదట నుంచి ఆసక్తిని కలిగిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండడం మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది. రీసెంట్ గా విడుదలైన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. నాని గత చిత్రం కృష్ణార్జున యుద్ధం ఫెయిల్… అలాగే నాగార్జున గత సినిమా ఆఫీసర్ డిజాస్టర్. అందుకే ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే వీరి జోరుకి విజయ్ దేవరకొండ బ్రేక్ వేయనున్నట్టు తెలుస్తోంది.

వరుస విజయాలతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా అతను నోటా అనే ద్విభాషా చిత్రం చేస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే కథ అయినప్పటికీ టీజర్ ద్వారా అందరిని తనవైపు తిప్పుకున్నారు.  ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అక్టోబర్ 4 న రిలీజ్ చేయాలనీ నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అంటే దేవదాస్ రిలీజ్ అయిన వారానికే నోటా పోటీకి రానుంది. విజయ్ కున్న క్రేజ్ చూస్తుంటే దేవదాస్ ప్రదర్శించే థియేటర్ల సంఖ్య తగ్గిపోవడం ఖాయమని తెలుస్తోంది. కొంచెం బాగాలేదని టాక్ వస్తే చాలు దేవదాస్ కోలుకోదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus