Devara: సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న చుట్టమల్లే.. అనిరుధ్ అదరగొట్టాడుగా!

దేవర (Devara) సినిమా థియేటర్లలో విడుదల కావడానికి మరో 45 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దేవర సినిమా ఆ అంచనాలను మించి ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన చుట్టమల్లే సాంగ్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కు ఇప్పటికే 52 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Devara

ఫియర్ సాంగ్ తెలుగు వెర్షన్ కు వచ్చిన వ్యూస్ ను ఇప్పటికే చుట్టమల్లే సాంగ్ క్రాస్ చేసింది. జాన్వీ కపూర్ Janhvi Kapoor) గ్లామర్, జూనియర్ ఎన్టీఆర్ స్టన్నింగ్ లుక్స్ ఈ సాంగ్ కు హైలెట్ గా నిలిచాయి. ఫాస్టెస్ట్ 50 మిలియన్స్ వ్యూస్ సాధించిన పాటగా చుట్టమల్లే సాంగ్ సంచలనం సృష్టించింది. అనిరుధ్  (Anirudh Ravichander)  ఈ సినిమాకు మ్యూజిక్ అదరగొట్టారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ పాటకు ఇప్పటివరకు 2 లక్షల రీల్స్ వచ్చాయని తెలుస్తోంది.

ఒక సాంగ్ కు 2 లక్షల రీల్స్ రావడం అంటే సులువైన విషయం కాదు. ఈ విధంగా కూడా ఈ సాంగ్ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. దేవర మూవీ రిలీజ్ సమయానికి ఈ సాంగ్ ఖాతాలో ఎన్ని రికార్డ్స్ చేరతాయో చూడాల్సి ఉంది. జాన్వీ కపూర్ కు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెడుతుందని అభిమానులు ఫీలవుతున్నారు. చుట్టమల్లే సాంగ్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ రికార్డ్స్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

దేవర సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ విషయంలో ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. దేవర1 సక్సెస్ సాధిస్తే దేవర2 సినిమాకు సంబంధించి వేగంగా షూట్ పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. దేవర బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus