బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక… ఇంట్లో జరిగే విషయాలను చెబుతుంటారు. అలానే ఈ సీజన్‌లో దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయ్యి వచ్చేసింది. ఓ రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. మొదట్లో సాఫీగా సాగిన ఆమె ఇంటర్వ్యూలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. కారణం ఆమె బిగ్‌బాస్ హౌస్, బిగ్‌బాస్ టీమ్ మీద చేస్తున్న విమర్శలు. జెన్యూన్‌గా ఉండేవాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండకూడదా అంటూ ప్రశ్నిస్తోంది దేవీ నాగవల్లి. ఇంకా ఆమె ఏమందంటే?
నేనేంటో బయట చాలామందికి తెలియదు. ఏదో రిపోర్టర్ అని మాత్రమే తెలుసు. కానీ బిగ్‌బాస్‌కు వెళ్లడం వల్ల నేనేంటో తెలిసింది. అందుకే గతంలో నన్ను విమర్శించినవాళ్లు ఇప్పుడు సపోర్టు చేస్తున్నారు. అందుకే నేను ఎలిమినేట్ అయినా, నన్ను మళ్లీ ఇంట్లోకి తీసుకురమ్మని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. ఇక నేను ఎందుకు బయటకు వచ్చేశాను అనే విషయంలో నాకు ఇంకా స్పష్టత రావడం లేదు. ఓట్లు తక్కువ వచ్చాయని నన్ను బయటకు పంపించారని చెప్పారు. అయితే బయటికొచ్చాక ‘నా కంటే తక్కువ ఓట్లు వచ్చినవాళ్లు ఉన్నారని తెలిసింది’. మరి అభిమానుల పేరుతో ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదు.
బిగ్‌బాస్ టీమ్ ఎక్స్‌పెక్ట్ చేసిన డ్రామా నేను ఇంట్లో క్రియేట్ చేయలేకపోతున్నానని నన్ను బయటకు తీసుకొచ్చేశారని అనుకుంటున్నాను. టాస్క్‌లు బాగా చేస్తున్నాను, అవసరమైనప్పుడు ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నా. అయితే ఇంకా ఏదో నా నుంచి ఆశిస్తున్నారని అనిపిస్తోంది. నాకైతే ఎలాంటి స్క్రిప్టు ఇవ్వలేదు. షో కూడా స్క్రిప్టు ప్రకారం నడుస్తోంది అనుకోవడం లేదు. కానీ మిగిలిన సభ్యులు స్క్రిప్టుతో వచ్చే అవకాశం ఉంది. వాళ్లు దానినే ఫాలో అవుతున్నారేమో.
అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ను నేను ‘జీరో’ చేశాక.. ఆయనలో చాలా మార్పు వచ్చింది. టాస్క్ సమయంలో ఆయన ఓవర్ రియాక్ట్ అవ్వలేదు. ఆయన ఫీలింగ్స్ అలా చెప్పారంతే. గంగవ్వ విషయంలో ఎవరైనా మాట్లాడితే నెగిటివ్‌గా వస్తుందని అనుకుని ఎవరూ ఆమె టాపిక్ తేవడం లేదు. కానీ నేను అలా ఊరుకునే రకం కాదు. అందుకే ఆమె కొంతమందినే దగ్గరకు తీసుకుంటున్నారని చెప్పాను. అక్కడ జరుగుతున్నదీ అదే. ఇక మోనాల్ – అభిజీత్ – అఖిల్ ట్రాయాంగిల్ స్టోరీ విషయంలో మోనాల్ నాకు క్లారిటీ ఇచ్చింది. మా మధ్య ఏం లేదని చెప్పింది.
ఇంట్లో ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరు గెలుస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే గంగవ్వను ప్రస్తుతం ఫిజికల్ టాస్క్‌ల విషయంలో దూరం పెడుతున్నారు. ఆమెను ఇన్‌వాల్వ్ చేసేలా టాస్క్‌లు పెడితే ఆమెదే టైటిల్ అనడం లో అతిశయోక్తి లేదు.